దేశ మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ప్రాజెక్టులు, ఆధునిక దేవాలయాలు..వాటిని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆనాడు చెప్పారని రేవంత్ గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తిగా ముందుకు సాగుతున్నామని.. సాగునీటి ప్రాజెక్ట్‌ట్‌లను పూర్తి చేయడం ద్వారా ఎడారిగా మారిన పాలమూరు జిల్లాను కృష్ణానీటితో సస్యశ్యామలం చేసేవిధంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఈ మేరకు ప్రతి నెలా ఈ జిల్లా ప్రాజెక్ట్‌లపై సమీక్షిస్తూ.. సత్వరమే పనులు పనులు పూర్తి చేసేలా ముందుకు సాగుతున్నామన్నారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ టెండర్లు పూర్తయ్యాయని, త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు వివరించారు. జిల్లాలో విద్య అవకాశాలు పెరగాలని.. మేరకు ప్రభుత్వ లా, ఇంజినీరింగ్ కళాశాలలను పాలమూరు యూనివర్సిటీకి మంజూరు చేసినట్లు వివరించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నిరుద్యోగులకు మాత్రమే ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలని అమర్‌రాజా బ్యాటరీ సంస్థతో మాట్లాడామని.. అందుకు వారు సైతం ఒప్పుకున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో జిల్లాలో వచ్చే పరిశ్రమలు ఇక్కడి నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment