ఈ రోజు తనకు కురుమూర్తిస్వామి దర్శన భాగ్యం కలగడం చాలా సంతోషంగా ఉందని.. ఈ దేవస్థానానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. కురుమూర్తి దేవస్థానానికి ఘాట్ రోడ్డు ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని అక్టోబర్ 11న స్థానిక శాసన సభ్యుడు కోరారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ ప్రాంత వ్యక్తి సీఎం కావడంతో వెంటనే ఈ రోజు రూ.110 కోట్లతో శంకుస్థాపన జరిగిందని.. వచ్చే బ్రహ్మోత్సవాల్లోపు ఘాట్ రోడ్ ప్రారంభోత్సవం చేసుకోనున్నట్లు వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యే జీఎమ్మార్ మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యార్థం అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసినందుకు సీఎంతో పాటు మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, కలెక్టర్ విజయేందిరబోయి, ఎస్పీ జానకి, అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్‌రావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment