వనపర్తి: నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల అనుమతులపై హైదరాబాద్‌లో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేకంగా అటవీశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ ప్రాజెక్టుల కోసం అవసరమైన భూమి కేటాయింపులు, అనుమతులపై చర్చించారు. అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ డోబ్రియల్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. వనపర్తి–రాజపేటతండా మార్గం (కొత్తకోట–ఆత్మకూరు రోడ్డుకు అనుసంధానం), వనపర్తి పాలకేంద్రం నుంచి అంజనగిరి వరకు బైపాస్ రోడ్డు (కొల్లాపూర్ రోడ్డుకు అనుసంధానం) ఈ ప్రాజెక్టులకు 17.139 హెక్టార్ల భూమి కేటాయింపు.. స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణానికి సర్వేనంబర్ 86లో 12.08 ఎకరాలు, సర్వేనంబర్ 25లో 0.12 ఎకరాల భూమి.. అంజనగిరితండాకు బీటీ రహదారి నిర్మాణానికిగాను సర్వేనంబర్ 6లో 0.69 హెక్టార్ల భూ సేకరణ.. వనపర్తి 8వ వార్డు శ్రీనివాసాపురంలో శ్మశానవాటికకు ఎకరం, హాకీ స్టేడియానికి సర్వేనంబర్ 56లో 5 ఎకరాల కేటాయింపుపై చర్చించారు. జిల్లా అటవీశాఖ అధికారి రామాంజనేయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment