వనపర్తి: జిల్లాకు గురువారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వస్తున్నారని.. పర్యటనను విజయవంతం చేసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. ఉదయం 9.30 గంటలకు రేవల్లి మండలం తల్పునూరు, గోపాల్‌పేట మండలంలోని ఏదుట్లలో విద్యుత్ సబ్‌స్టేషన్లను ప్రారంభిస్తారని చెప్పారు. అనంతరం జిల్లాకేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం పక్కన ఉన్న విద్యుత్‌శాఖ కార్యాలయ ఆవరణలో మండలానికి చెందిన ఖాసీంనగర్, చిమన్‌గుంటపల్లి, మెట్టుపల్లి, నాగవరం గ్రామాలు, పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి, గోపాల్‌పేట మండలం చెన్నూరు, శ్రీరంగాపూర్ మండలం నాగరాల, విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని వివరించారు. మధ్యాహ్నం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమవుతారని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకొని బుధవారం కలెక్టర్ వనపర్తి విద్యుత్‌శాఖ కార్యాలయం, గోపాల్‌పేట మండలం ఏదుట్ల సబ్‌స్టేషన్‌ను సందర్శించి ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆయన వెంట ఆర్డీఓ సుబ్రమణ్యం, విద్యుత్‌శాఖ డీఈ శ్రీనివాస్, తహసీల్దార్లు తిలక్‌కుమార్‌రెడ్డి, గోపాల్‌పేట ఎస్‌ఐ నరేశ్, ఇతర అధికారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment