మెరుగైన వైద్యసేవలే లక్ష్యం
అమరచింత/ఆత్మకూర్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం ఆయన అమరచింత, ఆత్మకూర్ మండలాల్లో పర్యటించారు. మొదట అమరచింతలోనే డీఎంఆర్‌ఎం ఆస్పత్రిని కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, జి.మధుసూదన్‌రెడ్డితో కలిసి సందర్శించారు. ప్రస్తుతం తిపుడంపల్లి పీహెచ్‌సీ ద్వారా సబ్‌సెంటర్‌ను కొనసాగిస్తున్నామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రికి వివరించారు. అధునాతన భవనం ఉందని.. పీహెచ్‌సీగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. నెల రోజుల్లో ఇందుకు సంబంధించిన జీఓను విడుదల చేయనున్నట్లు తెలిపారు. మాజీ అడ్వొకేట్ జనరల్ దేశాయి ప్రకాష్‌రెడ్డి తన తండ్రి మురళీధర్‌రెడ్డి స్మారకార్ధం ట్రస్టు ద్వారా పాఠశాల, ఆస్పత్రి భవనాలు, శుద్ధజల కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అనంతరం క్షయ రోగులకు న్యూట్రీషన్ కిట్లను పంపిణీ చేశారు.
డయాలసిస్ కేంద్రం ప్రారంభం..
ఆత్మకూర్ కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌లో రూ.3.50 కోట్లతో ఏర్పాటు చేసిన 5 పడకల డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. డయాలసిస్ రోగులు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. తమ ప్రభుత్వం విద్య, వైద్యం అందరికీ అందుబాటులో ఉంచేందుకు నిబద్ధతతో పని చేస్తోందని.. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో వైద్యసేవలను మరింత విస్తరిస్తామని వెల్లడించారు. అనంతరం 50 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి పీజేపీ క్యాంపులో స్థల పరిశీలన చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్లు గాయత్రి, మంగమ్మ, డీఎంహెచ్‌ఓ డా. శ్రీనివాసులు, ఎస్పీ రావుల గిరిధర్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, నాయకులు కేశం నాగరాజుగౌడ్, అయ్యూబ్‌ఖాన్, మహేందర్‌రెడ్డి, అరుణ్‌కుమార్, రహమతుల్లా, పరమేశ్, తులసీరాజ్ పాల్గొన్నారు.
అమరచింత సబ్‌సెంటర్
పీహెచ్‌సీగా మార్పు
డయాలసిస్ కేంద్రంతో రోగులకు మేలు
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి
దామోదర రాజనర్సింహ
Comments
Please login to add a commentAdd a comment