45 వేల ఎకరాల్లో వరిసాగు..
యాసంగిలో ప్రాజెక్టు కుడికాల్వ కింద 15 వేలు, ఎడమ కాల్వ కింద 20 వేల ఎకరాలకు వారబందీ విధానంలో సాగునీరు అందించాలని అధికారులు నిర్ణయించగా.. ఆయకట్టు రైతులు సుమారు 45 వేల ఎకరాల్లో వరిసాగు చేశారు. రామన్‌పాడ్ రిజర్వాయర్ దిగువనున్న ఆయకట్టుకు క్రాప్ హాలిడే ప్రకటించినా పలువురు రైతులు 10 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. కర్ణాటకలోని నారాయణపూర్ జలాశయం ఆయకట్టు కింద యాసంగిలో కేవలం ఆరుతడి పంటలకు మాత్రమే నీటిని వదులుతుండటంతో జూరాలకు వరద రాక నిలిచిపోయింది. ప్రస్తుతం జలాశయం నుంచి సోమవారం నుంచి గురువారం వరకు కాల్వలకు నీటిని వదులుతూ.. శుక్రవారం నుంచి ఆదివారం వరకు నిలిపివేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment