మొక్కుబడిగా గ్రామ, వార్డుసభలు | - | Sakshi
Sakshi News home page

మొక్కుబడిగా గ్రామ, వార్డుసభలు

Published Thu, Jan 23 2025 1:02 AM | Last Updated on Thu, Jan 23 2025 1:02 AM

మొక్క

మొక్కుబడిగా గ్రామ, వార్డుసభలు

వనపర్తి టౌన్‌: ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం రోజున అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికకు నిర్వహిస్తున్న గ్రామ, వార్డు సభలు మొక్కుబడిగా సాగుతున్నాయి. బుధవారం రెండోరోజు ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో కొనసాగాయి. జిల్లావ్యాప్తంగా 119 గ్రామ, వార్డు సభలు నిర్వహించగా ఆయా గ్రామాలు, వార్డుల్లో వచ్చిన ప్రజల సమక్షంలో అర్హుల జాబితాను అధికారులు చదివి వినిపించారు. అభ్యంతరాలు తెలిపిన వాటిని పరిశీలించి జాబితా నుంచి తొలగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అర్హులై ఉండి జాబితాలో పేర్లు రానిలేని వారు దరఖాస్తు చేసుకునేందుకు దరఖాస్తు ఫారాలు అందించారు. కొన్నిచోట్ల ఫారాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో అధికారుల తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరికొన్ని చోట్ల కేవలం అధికార పార్టీకి అంటకాగుతున్న వారికే జాబితాల్లో అఽధిక ప్రాధాన్యం ఇచ్చారని విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే అంశంపై పామాపురం గ్రామసభలో స్వల్ప దుమారం చెలరేగింది. కొన్నిచోట్ల అర్హులు అనివార్య కారణాలతో సభలకు హాజరుగాకపోవడంతో వారి పేర్లను జాబితా నుంచి తొలగిస్తున్నట్లు అధికారులు స్థానికుల వత్తిడి మేరకు ప్రకటించడం చర్చనీయాంశమైంది. మొదటి రోజుతో పోలిస్తే అర్హుల జాబితా పెరిగింది. రెండోరోజు జరిగిన సభలో అత్యధికంగా రేషన్‌ కార్డులకు 5,893 దరఖాస్తులు, ఇందిరమ్మ ఇళ్లకు 3,598, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 1,109 దరఖాస్తులు రాకగా.. అతి తక్కువగా రైతుభరోసాకు 96 దరఖాస్తులు వచ్చాయి.

స్పందన అంతంతే..

రెండోరోజు గ్రామ, వార్డు సభలకు ప్రజల నుంచి ఆశించినస్థాయిలో స్పందన రాలేదు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల చొరవతో ముందే జాబితా వెలువడటంతో జాబితాలో పేరున్న వారే సభకు రావడం కనిపించింది. కొన్నిచోట్ల సభలను అరగంటలోపే ముగించారు. మరికొన్ని చోట్ల పూర్తిస్థాయిలో వసతులు కల్పించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

పథకం లబ్ధిదారులు అభ్యంతరాలు ఆమోదం కొత్త

దరఖాస్తులు

ఇందిరమ్మ ఇళ్లు 18,783 213 18,661 3,598

రైతు భరోసా 18,661 447 17,939 96

రేషన్‌ కార్డులు 9,955 172 9,893 5,893

ఇందిరమ్మ

ఆత్మీయ భరోసా 3,422 578 2,749 1,109

No comments yet. Be the first to comment!
Add a comment
మొక్కుబడిగా గ్రామ, వార్డుసభలు 1
1/1

మొక్కుబడిగా గ్రామ, వార్డుసభలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement