నాణ్యమైన భోజనం అందించాలి
అమరచింత ఎత్తిపోతల కింద వరినాట్లు వేసుకుంటున్న కూలీలు (ఫైల్)
వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి మెస్, కాస్మొటిక్ చార్జీలను భారీగా పెంచిందని, వసతిగృహాల్లో కామన్ డైట్ మెనూ పక్కాగా అమలు చేస్తూ నాణ్యమైన భోజనం అందించాలని మైనార్టీ సంక్షేమశాఖ, ఉద్యానశాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా ఆదేశించారు. సీనియర్ మహిళా ఐఏఎస్‌లు బాలికల వసతి గృహాల్లో బస చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు బుధవారం జిల్లాకేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ఆమె సందర్శించారు. ముందుగా కలెక్టరేట్‌కు వచ్చిన ఆమెకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం అధికారులతో కలిసి వసతి గృహానికి చేరుకొని వంటగది, వంటసామగ్రి భద్రపర్చే గదిని పరిశీలించారు. వంట సామగ్రికి సంబంధించిన స్టాక్ రిజిస్టర్ నిర్వహిస్తున్నారా లేదా అని సిబ్బందితో ఆరా తీశారు. వంటగదిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కామన్ డైట్ మెనూ అమలు చేస్తున్నారా లేదా అని ప్రిన్సిపల్‌ను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్‌కు కోసం ఎంతో వెచ్చిస్తోందని.. వసతి గృహాల్లో కామన్ డైట్ మెనూ పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని అందించాలని సూచించారు. ఆమె వెంట ఆర్డీఓ సుబ్రమణ్యం, మైనార్టీ సంక్షేమశాఖ అధికారి అఫ్జలుద్దీన్, ఉద్యానశాఖ అధికారులు, గిరిజన సంక్షేమ పాఠశాల ప్రిన్సిపల్ సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
మైనార్టీ సంక్షేమశాఖ డైరెక్టర్
షేక్ యాస్మిన్‌బాషా
Comments
Please login to add a commentAdd a comment