జలం.. తగ్గుముఖం
వివరాలు 8లో u
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో తగ్గుతున్న నీటిమట్టం
●
ప్రణాళికతోనే సాగు,
తాగునీటి సరఫరా..
వేసవిలో తాగునీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పక్కా ప్రణాళికతో నీటి వినియోగం కొనసాగుతోంది. యాసంగి సాగుకుగాను ప్రభుత్వం నిర్దేశించిన ఆయకట్టుకు మాత్రమే జూరాల ప్రధాన ఎడమ కాల్వ ద్వారా నీటిని అందిస్తున్నాం. రామన్‌పాడ్ వరకు 20 వేల ఎకరాలకు నీటిని వదులుతున్నాం. అనధికారికంగా దిగువనున్న ఆయకట్టు రైతులు పంటలు సాగుచేస్తున్నారని తెలిసింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు వారబందీ విధానంలో నీటి విడుదల కొనసాగుతోంది.
– జగన్మోహన్, ఈఈ,
జూరాల ప్రాజెక్టు ఎడమకాల్వ విభాగం
ప్రియదర్శిని జూరాల
జలాశయంలో నీటిమట్టం
అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయంలో రోజురోజుకు నీటి నిల్వ తగ్గుతుండటంతో ప్రస్తుత యాసంగి పంటకాలం పూర్తయ్యే వరకు నీరందుతుందో లేదోనన్న సందేహాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో ఉమ్మడి జిల్లా తాగునీటి అవసరాలకు 2 టీఎంసీలు, ఆయకట్టుకు 2 టీఎంసీలు అవసరమని అధికారులు తగిన ప్రణాళికలు రూపొందించుకొని వారబందీ విధానంలో కాల్వలకు నీరు వదులుతున్నారు. జూరాల ఆయకట్టు 1.20 లక్షల ఎకరాలు ఉండగా.. యాసంగిలో ఎడమ కాల్వ పరిధిలో కేవలం రామన్‌పాడ్ వరకు 20 వేల ఎకరాలకు మాత్రమే వారబందీ విధానంలో సాగునీరు వదలాలని నిర్ణయించారు. దీంతో ఆత్మకూర్, అమరచింత మండలాల ఆయకట్టు రైతులకు మాత్రమే సాగునీరు అందుతుంది. రామన్‌పాడ్ దిగువనున్న మదనాపురం, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల ,చిన్నంబావి మండలాల్లోని ఆయకట్టు గ్రామాలకు సాగునీరు ఇవ్వలేమని ఇదివరకే అధికారులు టాంటాం వేయించారు. అయినా పలువురు రైతులు మాత్రం కాల్వల వెంట సాగునీరు వస్తుండటంతో మరో పదివేల ఎకరాల వరకు వరి సాగు చేశారు.
జలాశయంలో నీటి నిల్వలు ఇలా..
జలాశయంలో గరిష్ట నీటినిల్వ మట్టం 318.516 మీటర్లకుగాను.. ప్రస్తుతం 316.780 మీటర్ల మేర ఉంది. ప్రస్తుతం జలాశయంలో 6.371 టీఎంసీల నీటి నిల్వ ఉండగా.. 3.708 టీఎంసీలు మాత్రమే సాగు, తాగు నీటి అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఎగువ నుంచి వరద రాక తగ్గుముఖం పట్టింది. వారబందీ విధానంలో రోజుకు ప్రధాన కుడి కాల్వకు 430, ఎడమ కాల్వకు 640 క్యూసెక్కుల నీటిని పంట సాగుకు వదులుతుండగా.. రోజు 79 క్యూసెక్కుల నీరు ఆవిరవుతోంది. ప్రాజెక్టు ప్రధాన గేట్లతో పాటు ఎడమ కాల్వ హెడ్‌రెగ్యులేటరీ, భీమా సమాంతర కాల్వ హెడ్ రెగ్యులేటరీ షట్టర్ల మరమ్మతులు పూర్తిగాకపోవడంతో ఆవిరి నీటితో కలుపుకొని రోజుకు 1,400 క్యూసెక్కుల నీరు వృథా అవుతోంది.
● వేసవిలో తాగునీటి సరఫరాను దృష్టిలో ఉంచుకొని అధికారులు ఇప్పటి నుంచే నీటిని పొదుపుగా వినియోగించేందుకు చర్యలు చేపట్టారు. నిర్దేశించిన ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీటిని అందించి మిగిలిన నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించేందుకు కసరత్తు ప్రారంభించారు.
ప్రస్తుతం 6.50 టీఎంసీల నీటి నిల్వ
తాగునీటి అవసరాలకు
రెండు టీఎంసీలు కేటాయింపు
యాసంగిలో 35 వేల ఎకరాలకే
సాగునీరు
ఎడమ కాల్వ పరిధిలో
కేవలం రామన్‌పాడు వరకే..
సమాంతర కాల్వ, రామన్‌పాడ్ హెడ్
రెగ్యులేటరీ వద్ద లీకేజీలతో నీటి వృథా
Comments
Please login to add a commentAdd a comment