‘వాడ్రా’ను ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘వాడ్రా’ను ఏర్పాటు చేయాలి

Published Mon, Sep 16 2024 1:24 AM | Last Updated on Mon, Sep 16 2024 1:24 AM

‘వాడ్

కాజీపేట అర్బన్‌: వరంగల్‌లోని చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా మాదిరిగా ప్రభుత్వం వాడ్రాను ఏర్పాటు చేయాలని వీసీకే పార్టీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం అదా లత్‌ సెంటర్‌లోని అమరవీరుల స్తూపం వద్ద పౌర సమాజ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. భద్రకాళి, వడ్డేపల్లి చెరువుల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాల్ని తొలగించాలని డి మాండ్‌ చేశారు. కబ్జాదారుల నుంచి వరంగల్‌ నగరాన్ని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ జిలుకర శ్రీనివాస్‌, కొండ్ర శంకర్‌, శేషు, సాయిని నరేందర్‌, చింతం ప్రవీణ్‌, ఎర్రగట్టు స్వామి, క్రాంతికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

కేయూకు నేడు సెలవు

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీకి వర్సిటీ పరిధిలోని కాలేజీలకు ఈనెల 16న సెలవు ప్రకటించినట్లు రిజిస్ట్రార్‌ ఆచార్య పి.మల్లారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మిలాద్‌ ఉన్‌ నబీ నేపథ్యంలో.. ఈనెల 16న సెలవును ప్రకటించినట్లు మల్లారెడ్డి తెలిపారు. ఈనెల 17న యథావిధిగా యూనివర్సిటీకి వర్సిటీ పరిధి కాలేజీలకు పని దినంగానే పరిగణించాలని పేర్కొన్నారు.

రుద్రేశ్వరాలయంలో

మహా పూర్ణాహుతి

హన్మకొండ కల్చ రల్‌: రుద్రేశ్వరాలయంలో జ రుగుతున్న ఉత్తి ష్ట గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు ఆదివారం గణప తి హవనం, మహా పూర్ణాహు తి ఘనంగా నిర్వహించారు. మూల మహాగణపతిని శ్రీసిద్ధి బుద్ధి గణపతిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, వేద పండితులు మణికంఠ శర్మ, అర్చకులు సందీప్‌శర్మ, ప్రణవ్‌ ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాదాల వితరణ జరిగింది. గత తొమ్మిదిరోజులుగా దేవాలయంలో నిర్వహించిన పేరిణి, కూచిపూడి, భరతనాట్యం సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభకనబర్చిన చిన్నారులకు ఆర్యవైశ్య జాతీయ నాయకులు గట్టు మహేశ్‌బాబు ఆధ్వర్యంలో బహుమతులు ప్ర దానం చేశారు. సోమవారం కలశ ఉద్వాసన, ఉత్సవ విగ్రహ ఉద్వాసన, సాయంత్రం మహా శోభాయాత్ర ప్రారంభమవుతుందని స్వామివా రి నిమజ్జనోత్సవంతో ఉత్సవాల సమాప్తి జరుగుతుందని గంగు ఉపేంద్రశర్మ తెలిపారు.

పీఆర్టీయూ నూతన కార్యవర్గం

విద్యారణ్యపురి: పీఆర్టీయూ టీఎస్‌ హనుమకొండ జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆదివా రం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా మందల తిరుపతిరెడ్డి, జనరల్‌ సెక్రటరీగా ఫలిత శ్రీహరి, అసోసియేట్‌ అధ్యక్షులుగా డి.కోమల్‌రెడ్డి, కె.దయాకర్‌రెడ్డి, మహిళా అసోసియేట్‌ అధ్యక్షులుగా వి.వాణి, ఉపాధ్యక్షులుగా ఎ.మహిపాల్‌రెడ్డి, వి.రామాంజనేయులు, కె.రాజేందర్‌రెడ్డి, జి.విష్ణుమూర్తి, ఎం.సురేందర్‌, మహిళా ఉపాధ్యక్షురాలిగా పి.సరస్వ తి, కార్యదర్శులుగా బి.మురళీధర్‌, బి.శరత్‌గౌడ్‌, ఎల్‌.గణపతినాయక్‌, కె.రమేశ్‌బాబు, జి.రాజయ్య, మహిళా కార్యదర్శిగా నికల్‌ సుల్తానా ఎన్నికయ్యారు.

ఘనంగా సన్మానం

పీఆర్టీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, జనరల్‌ సెక్రటరీలుగా ఎన్నికై న మందల తిరుపతిరెడ్డి, ఫలిత శ్రీహరిని 14 మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు ఇతర బాధ్యులు ఘనంగా సన్మానించారు. కాజీపేట మండల అధ్యక్షుడు దేవిరెడ్డి మాలకొండారెడ్డి, వేలేరు మండల అధ్యక్షుడు బాను ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
‘వాడ్రా’ను ఏర్పాటు చేయాలి1
1/2

‘వాడ్రా’ను ఏర్పాటు చేయాలి

‘వాడ్రా’ను ఏర్పాటు చేయాలి2
2/2

‘వాడ్రా’ను ఏర్పాటు చేయాలి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement