పెన్షనర్లపై చిన్నచూపు | - | Sakshi
Sakshi News home page

పెన్షనర్లపై చిన్నచూపు

Published Fri, Oct 18 2024 1:36 AM | Last Updated on Fri, Oct 18 2024 1:36 AM

పెన్షనర్లపై చిన్నచూపు

హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు, ఉద్యోగులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని తెలంగాణ స్టేట్‌ గవర్నమెంట్‌ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోషియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి తిరువరంగం ప్రభాకర్‌ అన్నారు. గురువారం హనుమకొండ రాంనగర్‌లోని అసోసియేషన్‌ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ హనుమకొండ యూనిట్‌ సమావేశం జరిగింది. ఇందులో ప్రభాకర్‌ మాట్లాడుతూ.. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్‌లను విడుదల చేయకుండా ప్రభుత్వం ఉద్యోగులపై ఉదాసీన వైఖరి అవలంబిస్తోందని నిరసన వ్యక్తం చేశారు. హనుమకొండ యూనిట్‌ అధ్యక్షుడు మాదిరెడ్డి మల్లారెడ్డి అధ్యక్షతన జరి గిన ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గోపాల్‌ రెడ్డి, కార్యదర్శి సత్యనారాయణ, అసోసియేషన్‌ నాయకులు సంజీవరెడ్డి, చారి, కొమురయ్య, జగదీశ్‌రెడ్డి, రాజేశ్వర్‌ పాల్గొన్నారు.

ఈఏడాది కొత్త నోములు

కాజీపేట: ఈ ఏడాది అమావాస్య శుక్రవారం స్వాతి నక్షత్రం, కార్తె ఉన్నందున.. పడిపోయిన నోములు, కొత్త నోములు నోముకోవచ్చని శ్వేతార్క మూలగణపతి ఆలయ వైదిక కార్యక్రమాల నిర్వాహకుడు, విద్వత్‌సభ సభ్యుడు అయినవోలు రాధాకృష్ణ శర్మ తెలిపారు. కాజీ పేట శ్వేతార్క మూల గణపతి ఆలయ ఆవరణలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అక్టోబర్‌ 30న నరక చ తుర్దశి, 31న ధనలక్ష్మి పూజ, దీపావళి, నవంబర్‌ 1న నోము, 2న ఉదయం 8గంటల తర్వా త దేవుడిని ఎత్తుకోవచ్చని స్పష్టం చేశారు.

రంగనాథస్వామిని తాకిన

సూర్య కిరణాలు

కాశిబుగ్గ: గ్రేటర్‌ వరంగల్‌ కాశిబుగ్గలోని చారిత్రక శ్రీ రంగనాథస్వామి దేవాలయంలో కొలువై ఉన్న రంగనాథస్వామిని గురువారం సూర్యకిరణాలు తాకాయి. ఆలయ ప్రధాన అర్చకుడు ఆరుట్ల కృష్ణమాచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. విషయం తెలుసుకున్న పలువురు భక్తులు ఆలయానికి తరలివచ్చి పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు వంగరి రవి, చిలుపూరి సురేశ్‌కుమార్‌, సుల్తానా సమ్మక్క, మౌటం శ్రీనివాస్‌, కోలా కవిత, విరాటి ప్రకాశ్‌రెడ్డి, రాగుల ప్రసాద్‌, భాస్కర్‌ పాల్గొన్నారు.

రేపు ఉచిత

మెగా వైద్య శిబిరం

వరంగల్‌ క్రైం: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిఽధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ అధికారులు, సిబ్బందికి ఈనెల 19వ తేదీన (శనివారం) ఉదయం 9 గంటల నుంచి భీమారంలోని శుభం పోలీస్‌ కల్యాణ వేదికలో ఉచిత మెగా హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించనున్నట్లు సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. మెడికవర్‌, శరత్‌ ఐ హాస్పిటల్స్‌కు చెందిన వైద్యులు ఈ శిబిరంలో పాల్గొని పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలీస్‌ అధికారులు, సిబ్బంది, హోంగార్డుల కుటుంబ సభ్యులు పాల్గొని వైద్య శిబిరాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement