ఫీజు గడువు పొడిగింపు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ తదితర కోర్సుల మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షల ఫీజు గడువును మరోసారి పొడిగించారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా నవంబర్ 6 వరకు పరీక్ష ఫీజు చెల్లించుకోవచ్చని పరీక్షల నియంత్రణాఽధికారి ఆచార్య ఎస్.నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి తిరుమలాదేవి తెలిపారు. అలాగే రూ.50 అపరాధ రుసుముతో నవంబర్ 11 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. పూర్తి వివరాలు కేయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
బాల కార్మిక వ్యవస్థను
నిర్మూలించాలి
వరంగల్ లీగల్: బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని హనుమకొండ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జస్టిస్ క్షమాదేశ్ పాండే అన్నారు. మంగళవారం నగరంలోని బాలరక్షా భవన్‌లో వరంగల్, హనుమకొండ జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వరంగల్, హనుమకొండ జిల్లాల ఐసీడీఎస్ అధికారులతో ‘బాల్యపు శ్రమను కలిసికట్టుగా నిర్మూలిద్దాం’ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా క్షమాదేశ్ పాండే మాట్లాడుతూ.. బాలల పరిరక్షణలో ఎదురయ్యే ఎలాంటి సమస్యలనైనా జిల్లా న్యాయసేవాధికార సంస్థల దృష్టికి తీసుకొచ్చి న్యాయ సలహాలు, సూచనలు పొందవచ్చన్నారు. అనంతరం వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జస్టిస్ సాయికుమార్ మాట్లాడుతూ.. బాలకార్మిక వ్యవస్థను నిరోధించడానికి ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో కృషి చేయాలని కోరారు. సదస్సులో హనుమకొండ, వరంగల్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ల అన్నమనేని అనిల్ చందర్‌రావు, కె.వసుధ, జువైనల్ జస్టిస్ బోర్డు సభ్యులు డాక్టర్ కె.గోపికారాణి, మేరుగు సుభాశ్, సభ్యులు ఆకులపల్లి మధు, సుజాత, రామలీల, శాహేద, దామోదర్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఇన్‌చార్జ్ అధికారి ప్రవీణ్‌కుమార్, లీగల్ ఆఫీసర్ రాచపల్లి సురేశ్, సీడీపీఓలు పాల్గొన్నారు.
హనుమకొండ డీఎండబ్ల్యూఓగా
మురళీధర్‌రెడ్డి
న్యూశాయంపేట: హనుమకొండ జిల్లా మైనా ర్టీల సంక్షేమశాఖ అధికారిగా డి.మురళీధర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సెరికల్చర్ శాఖలో జాయింట్ డైరెక్టర్‌గా హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన(హనుమకొండ డిస్ట్రిక్ట్ మైనారిటీస్ వెల్ఫేర్ ఆఫీసర్)ను నియమిస్తూ మైనార్టీల సంక్షేమశాఖ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. బాధ్యతలు స్వీకరించిన ఆయనకు మంగళవారం బీఆర్‌ఎస్ నాయకులు మహ్మద్ నయీముద్దీన్, ఇస్మాయిల్, తాజ్ దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ బాధ్యులు మహ్మద్ సలీం అహ్మద్ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
‘డబ్బులిప్పిస్తే వెళ్లిపోతాం’
మామునూరు: సామాజిక మాధ్యమాల్లో ఆకర్షణీయ ప్రకటనలు చూసి మోసపోయామని, తాము ఫీజుల రూపేణా చెల్లించిన వేలాది రూ పాయలు ఇప్పిస్తే ఇంటికి వెళ్లిపోతామని అయాన్ పోలీస్ అకాడమీ శిక్షణార్థులు అభ్యర్థిస్తున్నారు. మోసానికి పాల్పడిన అయాన్ పోలీస్ అకాడమీ నిర్వాహకుడు ఎండీ అన్వర్‌ను తక్షణమే అరెస్ట్ చేసి చట్ట ప్రకారం శిక్షించాలని మంగళవారం మామునూరు పోలీస్ స్టేషన్‌లో వారు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. నిరుద్యోగుల ఫిర్యాదుతో నిర్వాహకుడి తీరుపై సమగ్ర విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment