రెడీ.. స్విమ్
6 నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే
– 8లోu
బాలికల హాస్టల్
పరిశీలన
కమలాపూర్: శిథిలావస్థకు చేరి పెచ్చులూడుతున్న ఉప్పల్ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీలత మంగళవారం పరిశీలించారు. వివిధ దినపత్రికలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచురితమైన కథనాలకు స్పందించిన కలెక్టర్ ప్రావీణ్య హాస్టల్‌ను పరిశీలించి నివేదిక అందించాలని ఆదేశించడంతో బాలికల హాస్టల్‌ను శ్రీలత పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి నివేదికను కలెక్టర్‌కు అందజేయనున్నట్లు డీడీ శ్రీలత తెలిపారు. ఆమె వెంట ఏఎస్‌డబ్ల్యూఓ కృష్ణ, హాస్టల్ వార్డెన్ రేచల, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హన్మకొండ అర్బన్ : నవంబర్ 6 నుంచి నిర్వహించనున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం మధిర తహసీల్దార్ కార్యాలయం నుంచి సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సర్వే ఉద్దేశ్యం, జిల్లా స్థాయిలో కలెక్టర్లు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు ప్రతీ మండలానికి ఒక జిల్లాస్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని, సర్వే నిర్వహణకు అవసరమైన ఫారాల మార్గదర్శకాలు ముద్రణ స్టేషనరీ ఏర్పాట్లు చేయాలని, ఇళ్ల జాబితా చేపట్టాలన్నారు. నల్లగొండ నుంచి వీసీలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లను ఆరా తీశారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ విద్యాలత, సీపీఓ సత్యనారాయణరెడ్డి, డీపీఓ లక్ష్మీరమాకాంత్, డీఈఓ వాసంతి, పరకాల మున్సిపల్ కమిషనర్ నరసింహ పాల్గొన్నారు.
పకడ్బందీగా సర్వే నిర్వహించాలి: కలెక్టర్
జిల్లాలో చేపట్టనున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో సర్వే మార్గదర్శకాలపై వివిధ శాఖల అధికారులు, మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఎంపీఎస్‌ఓలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. నేడు (బుధవారం) మండల స్థాయిలో సర్వేకు సంబంధించి వివిధ అంశాలను తెలియజేసేందుకు ఎన్యుమరేటర్లకు శిక్షణ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సర్వే మార్గదర్శకాలపై శిక్షణ పొందిన అధికారులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment