ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి
వర్ధన్నపేట: సరైన తేమ శాతం (17 శాతం కన్నా తక్కువ)తో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేకాధికారి, రిహాబిటేషన్ అండ్ రీ సెటిల్మెంట్ కమిషనర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు. ఇల్లంద మార్కెట్ కార్యాలయ ఆవరణలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు ఉన్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేయాలని అధికారులను కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని విక్రయించుకోవాలని సూచించారు. దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. అనంతరం అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. డీఆర్‌డీఓ కౌసల్యాదేవి, డీసీఎస్‌ఓ కిష్టయ్య, పౌసరఫరాల జిల్లా మేనేజర్ సంధ్యారాణి, జిల్లా వ్యవసాయాఽధికారి అనురాధ తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి
వినయ్‌కృష్ణారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment