ప్రజా ప్రభుత్వంలోనే అభివృద్ధి
సంగెం: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలోనే అభివృద్ధి పరుగులు పెడుతోందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టెక్స్‌టైల్ పార్కులో మౌలిక వసతుల కల్పనకు సీఎం నిధులు మంజూరు చేశారని తెలిపారు. నాలా అభివృద్ధి కోసం రూ 160.92 కోట్లు, 863 మంది భూనిర్వాసిత రైతులకు రూ.41.51 కోట్లతో ఇందిరమ్మ ఇళ్లు, కుడా లేఔట్, శానిటేషన్, ఎలక్ట్రికల్, డ్రింకింగ్ వాటర్ కోసం రూ 2.17 కోట్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక పాఠశాల, పార్కు అభివృద్ధి, ఇళ్ల కోసం మరో 12 ఎకరాల భూమి కేటాయించారని చెప్పారు. ఎయిర్‌పోర్టు అభివృద్ధి కోసం రూ 205 కోట్లు, ఖిలావరంగల్, స్తంభంపల్లి, వసంతాపూర్, గాడిపల్లి ఇన్నర్ రింగు రోడ్డు నిర్మాణం కోసం రూ 49.50 కోట్లు సీఎం మంజూరు చేశారన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మౌలిక వసతులు కరువయ్యాయని, ఒక కంపెనీ మాత్రమే వచ్చిందన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతే టెక్స్‌టైల్ పార్కు అభివృద్ధి, మామునూరు ఎయిర్‌పోర్టుకు అవసరమైన భూములు ఇచ్చేలా రైతులను ఒప్పించేందుకు కృషిచేశానన్నారు. మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడిన తీరు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందన్నారు. మౌలిక వసతుల కల్పన కోసం ఎకరానికి రూ 20 వేలు తీసుకుని పనులు పూర్తి చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చొల్లేటి మాధవరెడ్డి, పరకాల అధికార ప్రతినిధి జనగాం రమేశ్, మహిళా అధ్యక్షురాలు సంధ్య, నాయకులు గుమ్మడి హరిబాబు, ఆగపాటి రాజు, అప్పాల కవిత, రవికుమార్, సదయ్య పాల్గొన్నారు.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment