ప్రజలు జాగ్రత్తలు పాటించాలి
రాయపర్తి: చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యలపై ప్రజలు జాగ్రత్తలు పాటించాలని డీఎంహెచ్ఓ సాంబశివరావు సూచించారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించి సిబ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చలి తీవ్రత ఎక్కువైనప్పుడు బీపీ, హైపర్‌టెన్షన్, డయాబెటిస్ రోగులు జాగ్రత్తలు పాటించాలన్నారు. వీరు స్ట్రోక్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని సూచించారు. ఆయన వెంట పీహెచ్సీ సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment