ముల్కనూర్‌ సంఘం సేవలు భేష్‌ : ఎమ్మెల్యే రేవూరి | - | Sakshi
Sakshi News home page

ముల్కనూర్‌ సంఘం సేవలు భేష్‌ : ఎమ్మెల్యే రేవూరి

Published Sun, Nov 24 2024 3:20 PM | Last Updated on Sun, Nov 24 2024 3:20 PM

-

ఎల్కతుర్తి : ముల్కనూర్‌ సహకార సంఘం, పాలకవర్గానికి అందజేస్తున్న సేవలు భేషుగ్గా ఉన్నాయని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌ రెడ్డి కితాబిచ్చారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌ సహకార గ్రామీణ పరపతి, మార్కెటింగ్‌ సొసైటీని శనివారం ఎమ్మెల్యే రేవూరితో పాటు ఊకల్‌, కాపులకనపర్తి, వ్యవసాయ సహకార అధ్యక్షులు కలిసి సందర్శించారు. బ్యాంక్‌ అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ఎమ్మెల్యేకు పూలబొకే అందించి స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే కాటన్‌, రైస్‌ మిల్లులను పరిశీ లించారు. సంఘంలో రైతుల ప్రవేశ సభ్యత్వం, పొందే వ్యవసాయ సేవలు, అప్పులు తీర్చే విధానం, మార్కెటింగ్‌ కార్యకలాపాలను ప్రవీ ణ్‌రెడ్డి వారికి వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రకాశ్‌ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్శనలో జిల్లా సహకార అధికారి ఎం.నీరజ, సొసైటీల అధ్యక్షులు రమేశ్‌, సంపత్‌, కుమారస్వామి, రవీంద్ర, రాంరెడ్డి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement