ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలి
కాజీపేట రూరల్ : అర్హులైన యువతకు ఓటరుగా నమోదు చేసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని (స్పెషల్ సమ్మర్ రివిజన్) ఎన్నికల అబ్జర్వర్ ఆయేషా మష్రత్ ఖానం తెలిపారు. కాజీపేట బాపూజీనగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటరు నమోదు, సవరణ కేంద్రాన్ని మష్రత్ ఖానం శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె జిల్లా అధికారులు, బూత్ లెవల్ ఆఫీసర్లతో మాట్లాడారు. కాజీపేట మండల పోలింగ్ బూత్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. అనంతరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని ఓటరు నమోదు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, ఆర్డీఓ రాథోడ్ రమేశ్, కాజీపేట తహసీల్దార్ బావుసింగ్, ఆర్‌ఐలు ఎం.శివ, కృష్ణ, ఆర్పీలు పద్మ, స్వరూప పాల్గొన్నారు.
వరంగల్‌లో..
వరంగల్: గిర్మాజీపేట ఉన్నత పాఠశాలలోని 10, 11, 12 పోలింగ్ బూత్‌లను ఎన్నికల అబ్జ ర్వర్ ఆయేషా మస్రత్ ఖానం శనివారం పరిశీ లించారు. పోలింగ్ బూత్‌లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్, అధికారులు ఉన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
న్యూశాయంపేట : మైనార్టీ సంక్షేమ శాఖ, స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్–2 పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మాక్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి టి.రమేశ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మైనార్టీ అభ్యర్థులు (ముస్లిం, సిక్కులు, క్రిస్టియన్, బౌద్ధులు, పార్శీ, జైనులు) సుబేదారిలోని షరీఫన్ మజీద్ ఎదురుగా, అపోలో ఫార్మసీ పక్కన, రాధాకృష్ణ కిరాణంపై రెండో అంతస్తులో ఉన్న జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కార్యాలయంలో ఈనెల 29లోగా దరఖాస్తులు అందజేయాలని కోరారు. పూర్తి వివరాలకు 0870–2980533 ఫోన్‌నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.
ఇంటర్‌వర్సిటీ జూడో టోర్నీకి
కేయూ మహిళా జట్టు
కేయూ క్యాంపస్ : భోపాల్‌లోని ఎల్‌ఎన్‌సీటీ యూనివర్సిటీలో జరుగుతున్న సౌత్‌వెస్ట్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ జూడో టోర్నీలో పాల్గొనే కాకతీయ యూనివర్సిటీ మహిళా జట్టును ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ వై.వెంకయ్య శనివారం తెలి పారు. జట్టులో కె.అనూష, డి.ప్రగతి, డి.బేబిలత, డి.నక్షత్ర (టీఎస్‌డబ్ల్యూ ఆర్డీసీ, వరంగల్ వెస్ట్), టి.చంద్రకళ, పి.నాగలక్ష్మి (టీటీడబ్ల్యూ ఆర్డీసీ, కొత్తగూడెం) ఉన్నారు. ఈ జట్టుకు టీడబ్ల్యూ ఆర్డీసీ (ఉమెన్) వరంగల్ వెస్ట్ ఫిజికల్ డైరెక్టర్‌జ్యోతి కోచ్, మేనేజర్‌గా వ్యవహరిస్తారని తెలిపారు.
25 నుంచి ‘వికసిత్ భారత్’
వరంగల్: ప్రధాని నరేంద్రమోదీతో తమ అభిప్రాయాలను ప్రత్యక్షంగా పంచుకునే గొప్ప అవకాశాన్ని ఉమ్మడి జిల్లాలోని యువత సద్వినియోగం చేసుకోవాలని నెహ్రూ యువ కేంద్రం జిల్లా యువజన అధికారి అన్వేశ్ చింతల ఒక ప్రకటనలో కోరారు. మేరా యువభారత్ వేదికగా ప్రారంభంకానున్న వికసిత భారత్ చాలెంజ్‌లో యువత భాగస్వామ్యం కోసం భారత ప్రభుత్వం ఒక కొత్త వేదికను ప్రారంభించిందని పేర్కొన్నారు. 2025లో జరిగే నేషనల్ యూత్ ఫెస్టివల్ స్థానంలో ‘వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ను ప్రారంభిస్తున్నారని తెలిపారు. ఈనెల 25 నుంచి డిసెంబర్ 5 వరకు ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’కు సంబంధించిన www. mybharat.gov.in డిజిటల్ క్విజ్‌లో పాల్గొనాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment