ఇటీవల రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్లు, జిల్లా సంక్షేమాధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస తనిఖీలు చేస్తున్నారు. దీంతో పాఠశాలల్లో ఇటు ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు అలర్ట్ అయ్యారు. గతంలో మెనూ పాటించకున్నా ఎవరూ పట్టించుకోలేదు. కానీ వరుస తనిఖీలతో అక్కడక్కడా మెనూ అమలు చేస్తున్నట్లు ‘సాక్షి’ విజిట్‌లో వెల్లడైంది. ఈ పర్యవేక్షణ మూణ్నాళ్ల ముచ్చటగా మారుతుందా.. నిరంతరం కొనసాగుతుందా అనేది వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment