రెండో రోజూ 598 ఎగ్జిబిట్ల ప్రదర్శన
నర్సంపేట రూరల్: నర్సంపేట మండలం రామవరం గ్రామంలోని శివాని హైస్కూల్‌లో జిల్లాస్థాయి ఇన్‌స్పైర్, విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలో రెండో రోజు బుధవారం విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 13 మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొని 598 ఎగ్జిబిట్లు ప్రదర్శించారు. 92 పాఠశాలల నుంచి మూడు వేల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు తరలివచ్చి ఎగ్జిబిట్లను వీక్షించారు. న్యాయనిర్ణేతలు ఎగ్జిబిట్లను పరిశీలించి వివరాలను నమోదు చేసుకున్నారు. విద్యార్థుల నృత్యాలు అలరించాయి. జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్, నర్సంపేట ఎంఈఓ కొర్ర సారయ్య, సైన్స్ ఫెయిర్ నిర్వహణ కమిటీ సభ్యులు పట్టాభి, శివాని పబ్లిక్ స్కూల్ చైర్మన్ వేములపల్లి సుబ్బారావు, డైరెక్టర్ రాహుల్ వర్మ, కమిటీల బాధ్యులు సుధాకర్‌రావు, బాలాజీరావు, లక్ష్మయ్య, పాపమ్మ, అనిత, రంగారావు, పట్టాభి, జయ, మంగ్య, భిక్షపతి, రామచంద్రరావు, జ్యోతి, లక్ష్మి, రమేశ్ పాల్గొన్నారు.
చంద్రయాన్ –3 ప్రాజెక్టు
ఇటుకాలపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థి సీహెచ్. సతీశ్ చంద్రయాన్–3 ప్రాజెక్టును తయారు చేశాడు. చంద్రయాన్–1 చంద్రుడిపై పరిశోధన, చంద్రయాన్–2లో ల్యాండర్‌ను చంద్రుడిపై సాఫ్ట్‌గా ల్యాండింగ్ చేయడం, రోవర్‌ను నడపడం ప్రధాన ఉద్దేశం. చంద్రమండలంపై ఉన్న అపారమైన హీలియం మూలకాన్ని పొందడమే చంద్రయాన్–3 ప్రాజెక్టు లక్ష్యమని ఆయన పేర్కొన్నాడు. గైడ్ టీచర్ ఎర్ర రవీందర్ సహకారంతో ప్రాజెక్టును తయారు చేసినట్లు తెలిపాడు.
వీక్షించిన మూడు వేల మంది
విద్యార్థులు, ఉపాధ్యాయులు
వివరాలను నమోదు చేసుకున్న
న్యాయనిర్ణేతలు
Comments
Please login to add a commentAdd a comment