వ్యాక్సినేషన్‌లో నిర్లక్ష్యం వద్దు
సంగెం: వ్యాక్సినేషన్‌లో నిర్లక్ష్యం వద్దని ఏఏఎన్‌ఎంలకు నర్సంపేట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ప్రకాశ్ సూచించారు. సంగెం గ్రామీణ కుటుంబ సంక్షేమ కేంద్రం, చింతలపల్లి, సంగెంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను బుధవారం ఆయన సందర్శించి వ్యాక్సిన్లు, రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రకాశ్ మాట్లాడుతూ వ్యాక్సినేషన్ రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, చిన్నారులకు సకాలంలో టీకాలు వేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి వంశీకృష్ణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment