ఆక్రమణల తొలగింపు
వరంగల్ అర్బన్: కాజీపేట నిట్ ప్రధాన రహదారికి ఇరువైపులా పుట్‌పాత్‌లపై ఆక్రమణలను బుధవారం తొలగించారు. బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఆదేశానుసారం బల్దియా డీఆర్ఎఫ్ సిబ్బంది ఉద్రిక్తతల నడుమ పోలీసుల సహకారంతో ఖాళీ చేయించారు. దీంతో చిరువ్యాపారులు అడ్డుకోవడంతోపాటు ఆందోళన వ్యక్తం చేశారు. పాదచారులు నడిచే ఫుట్‌పాత్‌లు, చేంజ్ ఫర్ సైకిల్ ట్రాక్‌పై ఇష్టారాజ్యంగా డబ్బాలు, తాత్కాలికంగా షెడ్లను, తోపుడు బండ్లను ఏర్పాటు చేసుకుని చిరువ్యాపారాలు నిర్వహిస్తున్నారు. నగర సుందరీకరణలో భాగంగా జంక్షన్లు, రహదారులపై ఇరువైపులా ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగిస్తున్నట్లు బల్దియా అసిస్టెంట్ సిటీ ప్లానర్ రజిత తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment