వర్ధన్నపేట: కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారాలతో పబ్బం గడుపుతోందని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్‌రెడ్డి దుయ్యబట్టా రు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ.. డిసెంబర్ 9వ తేదీన సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా రైతు పండుగ పేరుతో మహబూబ్‌నగర్‌లో భారీ బహిరంగసభ ఏర్పాటు చేసి రైతులకు రూ.2 లక్షల వరకు రుణాన్ని మాఫీ చేస్తున్నామని చెప్పి అన్ని ప్రధాన పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుందన్నారు. బహిరంగ సభ ముగిసినా ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రుణమాఫీ జమ చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం అసత్య ప్రచారాలు మాటలు మానుకుని పనులు చేసి చేతల్లో చూపించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment