కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
నర్సంపేట: ఆజాంజాహి మిల్లు కార్మికులు కొనుగోలు చేసి భవనం నిర్మించి కాపాడుకున్న స్థలాన్ని కాజేయడానికి భవనాన్ని కూల్చివేసి తప్పుడు పత్రాలతో కబ్జాకు పాల్పడుతున్న వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆజాంజాహి మిల్లు కార్మికులకు న్యాయం చేయాలని ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంసీపీఐ(యూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం అదనపు కలెక్టర్ సంధ్యారాణికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆజాంజాహి మిల్లు కార్మికులు మిల్లు నడుస్తున్న సందర్భంలో చందాలు వేసుకొని 12గుంటల స్థలాన్ని తమ సంఘ కార్యకలాపాల కోసం కొనుగోలు చేసి పెద్ద భవనాన్ని నిర్మించుకున్నారు. పాలకుల నిర్లక్ష్యంతో మిల్లు మూతపడగా ఆ స్థలంపై కన్నేసిన భూ కబ్జాదారులు అధికార పార్టీలను మచ్చిక చేసుకొని కాజేయాలని తప్పుడు పత్రాలు సృష్టించి గత ప్రభుత్వ హయాంలో ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారన్నారు. కార్మికులు కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలకు నాటి కాంగ్రెస్ నాయకులు అండగా నిలిచారన్నారన్నారు. కానీ, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు కార్మికులు నిర్మించుకున్న భవనాన్ని.. కబ్జాదారులకు అండగా నిలిచి కూల్చివేడయం అన్యాయమన్నారు. గోనె కుమారస్వామి, మంద రవి, నర్ర ప్రతాప్, సుంచు జగదీశ్వర్, ఐతమ్ నాగేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment