మెరుగైన విద్యుత్ సరఫరాకు చర్యలు
నర్సంపేట: నర్సంపేట పట్టణంలో మెరుగైన విద్యుత్ సరఫరాకు స్థానిక ఎమ్మెల్యే మాధవరెడ్డి సహకారంతో చర్యలు చేపడుతున్నామని పీసీసీ సభ్యుడు పెండెం రామానంద్ అన్నారు. ఈ మేరకు నర్సంపేట పట్టణం ద్వారకపేట రోడ్డులోని బాలాజీ మహిళా డిగ్రీ కళాశాల పరిధిలో నూతన ట్రాన్స్ ఫార్మర్, పది కరెంటు స్తంభాలు ఏర్పాటుకు బుధవారం ఏఈ విజయ్‌భాస్కర్‌తో కలిసి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని 24వార్డుల్లో ఇప్పటికే విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు చేపడుతూ మెరుగైన విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు, స్తంభాలు అవసరం ఉన్న చోట నిర్మాణాలు చేపడతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment