స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయం
నల్లబెల్లి: విద్యార్థినలకు దుప్పట్లు పంపిణీ చేసిన స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయమని జిల్లా జీసీడీఓ ఫ్లోరెన్స్ అన్నారు. ఏబీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ నిర్వహకులు స్థానిక కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల పాఠశాల 6వ తరగతి విద్యార్థినులకు బుధవారం దుప్పట్లు అందజేశారు. చలితీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో విద్యార్థినులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఎన్‌పీఆర్‌డీ జిల్లా అధ్యక్షుడు అడ్డ రాజు, ప్రశాంత్, వినయ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment