పాఠశాలలను బలోపేతం చేయాలి
పర్వతగిరి: పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎంఈఓ లింగారెడ్డి అన్నారు. ఈ మేరకు మండలంలోని పర్వతగిరి జెడ్పీహెచ్‌ఎస్‌లో బుధవారం ప్రాథమిక స్థాయి, యూపి లెవల్ తెలుగుభాష స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లింగారెడ్డి మాట్లాడారు. కాంప్లెక్స్ హెచ్‌ఎం రమేశ్‌బాబు, వెంకటరమణారెడ్డి, డాక్టర్ భాస్కర్, ప్రసాద్ పాల్గొన్నారు.
నాగపడిగె రూపంలో తాటిగెల
నర్సంపేట రూరల్: నర్సంపేట మండలం ముగ్దుంపురంలోని ఓ తాటిచెట్టుపై బుధవారం నాగపడిగె రూపంలో తాటిగెల కని పించింది. వృత్తిలో భాగంగా గీతకార్మికుడు బైరగోని సత్యం తాటిచెట్టు ఎక్కగా నాగపడిగె రూపంలో గెల కనిపించింది. దీంతో ఆ గెలను కిందకు తీసుకొచ్చి తోటి గీతకార్మికులకు చూపించారు.
చెక్కు అందజేత
చెన్నారావుపేట: మండలంలోని పదహారు చింతల్ తండాకు చెందిన లకావత్ సాల్కి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతుంది. దీంతో ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.60 వేలు విలువ చేసే సీఎంఆర్‌ఎఫ్ చెక్కును కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూక్య గోపాల్‌నాయ క్ అందించారు. ధన్‌సింగ్ ఉన్నారు.
శ్రీనివాస్‌కు సేవారత్న అవార్డు
గీసుకొండ: 16వ డివిజన్ ధర్మారానికి చెందిన వల్లెం శ్రీనివాస్ జాతీయ సేవారత్న–2024 అవార్డును మంగళవారం న్యూఢిల్లీలో స్వీకరించారు. అంతర్జాతీయ బహుజన సాహిత్య సేవారత్న ఫౌండర్ నల్లల రాధాకృష్ణ బహుజన సాహిత్య అకాడమీ జాతీయ సదస్సులో ఈ అవార్డును శ్రీనివాస్‌కు అందజేశారు.
ప్రభుత్వ సలహాదారును కలిసిన కాంగ్రెస్ నాయకులు
పర్వతగిరి: ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని బుధవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్‌రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ కార్యక్రమంలో శేఖర్‌రావు పాల్గొన్నారు.
బీజేపీ బూత్ కమిటీ
అధ్యక్షుల ఎన్నిక
రాయపర్తి: మండలంలోని పెర్కవేడులో పార్టీ సభ్యత్వ నమోదులో భాగంగా బూత్ కమిటీలను ఎన్నిక చేసినట్లు బీజేపీ మండలపార్టీ అధ్యక్షుడు నూనె అనిల్ బుధవారం తెలిపారు. బూత్ కమిటీ అధ్యక్షులుగా కూన యాదగిరి, రాసాల రాకేష్, రాజును ఎన్నుకున్నట్లు తెలిపా రు. ఎనగందుల శ్రావణ్‌కుమార్, అనిల్, సుధాకర్, సుమన్, రాకేష్, నిఖిల్, రామకృష్ణ, సంపత్, సాయికుమార్, నవీన్ పాల్గొన్నారు.
ముదిరాజ్ మహాసభ
మండల కార్యవర్గం..
ముదిరాజ్ మహాసభ మండల కార్యవర్గాన్ని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలోని తిర్మలాయపల్లి గ్రామానికి చెందిన ముద్రబోయిన వెంకటేశ్వర్లును మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. మండల ప్రధానకార్యదర్శిగా కనుకుంట్ల లక్ష్మీనారాయణ, ఉపాధ్యాక్షులుగా షాపురం సాయిలు, కాయిత వెంకన్న, కనుకుంట్ల యాకయ్య, మండల యూత్ అధ్యక్షుడిగా నర్సింహుల రమేశ్, ప్రధానకార్యదర్శిగా సుధాకర్‌లను ఎన్నిక చేశారు. చీప్‌ప్రమోటర్ చొప్పరి సోమయ్య, జిల్లా ప్రధానకార్యదర్శి నీరటి సదానందం, పోలు అమర్బంద్, కాశీనాథం, సుధాకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
విద్యార్థులకు
జీవశాస్త్ర ప్రతిభా పరీక్ష
కాళోజీ సెంటర్: వరంగల్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం పదో తరగతి విద్యార్థులకు జిల్లాస్థాయి జీవశాస్త్ర ప్రతిభా పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి కట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రతిభా పరీక్ష నిర్వహించడం వల్ల బోర్డు పరీక్షల్లో అధిక మార్కులు పొందుతారని తెలిపారు. తెలంగాణ జీవశాస్త్ర ఫోరం జిల్లా, రాష్ట్రస్థాయిలో పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. జిల్లాస్థాయి విజేతలకు ఈనెల 28న రాష్ట్రస్థాయి పరీక్షలు ఉంటాయని వివరించారు. అనంతరం విజేతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment