నేరాలు – ప్రమాదాలు
చికిత్స పొందుతున్న మహిళ మృతి
వర్ధన్నపేట: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మహిళ బుధవారం రాత్రి మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్ధన్నపేట పట్టణానికి చెందిన కొండేటి లక్ష్మి(65) ఈ నెల 12న ఎస్సీ కాలనీ సమీపంలోని ఫంక్షన్ హాల్‌లో శుభకార్యానికి హా జరై తిరిగి ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న క్రమంలో వరంగల్ నుంచి సూర్యాపేట వెళ్తున్న డీసీం వ్యాన్ ఆమెను బలంగా ఢీ కొట్టడంతో తల కు తీవ్ర గాయాలయ్యాయి. వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జీపీ కార్మికుడి మృతి
రాయపర్తి: కట్టెలు కొడుతుండగా ప్రమాదశాత్తు కర్ర తగిలి గ్రామపంచాయతీ కార్మికుడు మృతి చెందిన ఘటన మండలంలోని మొరిపిరాల గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు రూ.10 వేలు బాధిత కుటుంబానికి అందించారు. పంచాయతీ కార్యదర్శి సోమరాజు, యా కూబ్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, కుమార్ పాల్గొన్నారు.
శతాధిక వృద్ధురాలి మృతి
దుగ్గొండి: మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురా లు దామెర సాయమ్మ(104 ) గత కొద్ది రోజులుగా అనా రోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతి చెందింది. సాయమ్మ కుమారుడు దామెర సమ్మయ్య నిరుపేద కుటుంబానికి చెందినవాడు కావడంతో గ్రామస్తుల సాయంతో సాయమ్మ దహనసంస్కారాలు నిర్వహించారు.
గీత కార్మికుడికి గాయాలు
నెక్కొండ: తాటిచెట్టుపై నుంచి పడడంతో గీత కా ర్మికుడు తీవ్ర గాయపడ్డాడు. తోటి గీతా కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. నెక్కొండకు చెందిన తాళ్లపెల్లి చెన్నకేశవులు పత్తిపాక తాటి వ నానికి బుధవారం ఉదయం వెళ్లాడు. చలి తీవ్రంగా ఉండడంతో పట్టు తప్పి చెట్టుపై నుంచి జారి పడ్డాడు. ఈ ప్రమాదంలో చెన్నకేశవులు నడుము, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారని వారు పేర్కొన్నారు.
వైన్స్‌లో చోరీ
ఖానాపురం: అశోక్‌నగర్ శివారులోని పాకాల వైన్స్‌లో చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రోజూ మాదిరిగానే నిర్వాహకులు మంగళవారం రాత్రి వైన్స్‌ను మూసివేసి వెళ్లా రు. కాగా, రాత్రి సమయంలో ఆగంతకులు వైన్స్ రేకులను తొలగించి లోపలకు ప్రవేశించారు. రూ.37,100 నగదు, రెండు బాలెంటైన్స్, ఒక ఆంటిక్విటీ, రెండు రెడ్ లేబుల్ మద్యం ఫుల్‌బాటిళ్లను అపహరించారు. దీంతోపాటు సీసీ కెమెరాల ఫుటే జీ పరికరాలను సైతం తీసుకెళ్లారు. బుధవారం ఉదయం వైన్స్‌ను తెరిచిన నిర్వాహకులు చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసుకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని దుగ్గొండి సీఐ సాయిరమణ పరిశీలించారు. క్లూస్‌టీం ఆధ్వర్యంలో వివరాలను సేకరించారు. యజమా ని ముఖేష్ ఫిర్యాదును స్వీకరించి పోలీసులు విచారణ చేపట్టారు.
రుద్రగూడెంలో మరో చోరీ
నల్లబెల్లి: మండలంలోని రుద్రగూడెం గ్రామంలో ఓ ఇంట్లో బుధవారం చోరీ జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామాని కి చెందిన రఘుసాల హనుమంత్ ఇంటి తాళం ప గులగొట్టిన ఓ బాలుడు బీరువాలోని రూ.10వేలు గ్లూకో మీటర్ అపహరించుపోయాడు. చోరీకి పా ల్పడిన బాలుడు నర్సంపేట మండలంలోని రాజేశ్వర్‌రావుపల్లెకు చెందినవాడిగా స్థానికులు గుర్తించి పోలీసులకు తెలిపారు. ఈ మేరకు బాధితుడు హనుమంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment