కనులపండువగా నారికేళ పడిపూజ
సంగెం: అయ్యప్ప నామస్మరణతో బుధవారం సంగెం మండల కేంద్రం మార్మోగిపోయింది. సంగెంలో గురుస్వామి నల్ల శంకర్, రజిత దంపతుల కుటీరంలో గురుస్వామి కేసముద్రం ధర్మశాస్త ఆలయ ప్రధాన తంత్రి విష్ణునారాయన్ కుట్టి ఆధ్వర్యంలో నారికేళ పడిపూజ నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. గోవిందరాజు, ప్రభాకర్, లక్ష్మణ్, శరత్, అనిల్ పాల్గొన్నారు.
అయ్యప్పస్వామికి అభిషేక పూజలు
నర్సంపేట: నర్సంపేట పట్టణంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో ఆలయ చైర్మన్ శింగిరికొండ మాధవశంకర్‌గుప్తా ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు బుధవారం అయ్యప్పస్వామికి అభిషేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓంసాయి రియల్ ఎస్టేట్ నర్సంపేట, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి, రుద ఓంప్రకాశ్‌మల్లేశ్వరి, శింగిరికొండ ఉపేందర్, కరుణకార్‌రెడ్డికవిత, కృష్ణహైమ, శ్రావణి, అమిత్‌కుమార్‌స్వరూప, పోటు రవీందర్‌రెడ్డిసాంబలక్ష్మి, తోటకూరి రాజు, సాంబయ్యగౌడ్, కారు, రవీందర్‌దీప్తి, పావనివేణు, వెంకటేశ్వర, సునితరామస్వామి, యాదగిరిరావు, నరసింహారెడ్డి, రాజేష్, ప్రభాకర్, వాసు, సాంబరెడ్డి, సోమలింగం, రాజు, ఆలయ అధ్యక్షుడు సురేష్, ప్రధాన కార్యదర్శి కమలాకర్‌రెడ్డి, కోశాధికారి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
పడిపూజకు విరాళం
గీసుకొండ: గీసుకొండలో అయ్యప్ప పడిపూజ నిర్వహణకు స్టేట్ బ్యాంకు రిటైర్డ్ మేనేజర్ పెగళ్లపాటి లక్ష్మీనారాయణ–గీత దంపతులు రూ.50,116 నగదును బుధవారం విరాళంగా అందించారు. కుమారస్వామి, సుధీర్, యాదగిరి, లక్ష్మణ్, నరిశెట్టి శ్రీనివాస్, కనకయ్య, హరీశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment