‘స్థానిక’ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి
● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
పరకాల: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పని చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పి లుపునిచ్చారు.బుధవారం పరకాల మండలం నా గారం, వెల్లంపల్లి, కామారెడ్డిపల్లె గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆ యన మాట్లాడుతూ..కాంగ్రెస్ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని ప్రాధాన్యతా క్రమంలో అంచెలంచెలుగా నెరవేరుస్తామన్నారు. ప్రభుత్వంపై బీ ఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప రకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ పరకాల మండల అధ్యక్షుడు కట్కూరి దేవేందర్‌రెడ్డి,మండల అధికా రులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment