సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
హన్మకొండ అర్బన్: జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల పరిధిలో సాధారణ ప్రసవాలు జరిగేలా గర్భిణులను వైద్య సిబ్బంది ప్రోత్సహించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్‌లో జిల్లాలోని పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల ప్రగతి లక్ష్యాన్ని మార్చి వరకు చేరుకోవాలన్నారు. సెక్షన్ ప్రసవాలను తగ్గిస్తూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించాలని ఇందుకు సిబ్బది క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ–ఔషధి పోర్టల్‌ను ఎప్పటికప్పుడు అప్డే ట్ చేస్తూ ఆరోగ్య కేంద్రాల్లో మందుల కొరత లేకుండా చూడాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు, ఎంటీపీ చట్టానికి వ్యతిరేకంగా అబార్షన్లు నిర్వహించే వారిపై కంప్లయింట్ బాక్స్, మెయిల్ ఐడీని కలెక్టర్ ప్రావీణ్య ఆవిష్కరించారు. డీఎంహెచ్‌ఓ అప్పయ్య మాట్లాడుతూ.. రెండో కాన్పునకు సంబంధించి స్థానిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షించిన అనంతరమే ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి రిఫర్ చేయాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ డీఎంహెచ్‌ఓ టి.మదన్మోహన్‌రావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కె.విజయకుమార్, పీఓడీటీటీ కె.లలితాదేవి, డీటీసీఓ హిమబిందు, ప్రోగ్రాం అధికారులు, వైద్యులు అహ్మద్, నాగరాజు, డెమో వి.అశోక్ రెడ్డి, ఆడిట్ ఆఫీసర్ ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.
22లోగా ఎస్‌హెచ్‌జీలకు భూముల గుర్తింపు
స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ఈనెల 22లోగా మరో 75 ఎకరాలు గుర్తించి జాయింట్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఈ పవర్ ప్లాంట్ల ఏర్పాటుతో 1,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఇంధన శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా ఒప్పందం కుదిరిన నేపథ్యంలో.. జిల్లాల వారీగా ప్రగతిని బుధవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ నుంచి మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. హనుమకొండ కలెక్టరేట్ నుంచి పాల్గొన్న కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడారు. సమావేశంలో డీఎఫ్‌ఓ లావణ్య, అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ వెంకటరమణ, డీఆర్‌డీఓ మేన శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రావీణ్య
Comments
Please login to add a commentAdd a comment