ఇళ్ల సర్వే త్వరగా పూర్తి చేయండి
● జెడ్పీ సీఈఓ విద్యాలత
శాయంపేట: ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పంచాయతీ కార్యదర్శులు త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ జెడ్పీ సీఈఓ విద్యాలత అన్నారు. మండలంలోని తహరాపూర్‌లో జరుగుతున్న సర్వేను బుధవారం ఆమె తనిఖీ చేశారు. అనంతరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రహరీని, మధ్యాహ్న భోజనం కిచెన్ షెడ్‌ను, ప్రాథమిక పాఠశాలలోని కిచెన్‌ను, అంగన్‌వాడీ కేంద్రాన్ని, గ్రామంలోని నర్సరీని పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాలలోని విద్యార్థులకు మధ్యా హ్న భోజన నిర్వాహకులు నాణ్యమైన పౌష్టికారం అందించాలని సూచించారు. ఆమె వెంట ఎంపీడీఓ ఫణిచంద్ర, ఏపీఓ అనిత, పంచాయతీ కార్యదర్శి, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment