నిషేధిత ఔషధాలు అమ్ముతున్న ఒకరి అరెస్ట్
ఎంజీఎం: వరంగల్ పోస్టాఫీస్ సమీపంలోని గుడ్ హెల్త్ మెడికల్ షాపులో డ్రగ్స్ కంట్రోల్ టీం పోలీసులు, ఔషధ నియంత్రణ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం నిషేధించిన మత్తు ట్యాబెట్లను ప్రిస్క్రిప్షన్ లేకుండా యువతకు విక్రయిస్తున్నట్లు గుర్తించి.. నిషేధిత ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మందుల షాపు యజమానిని అదుపులోకి తీసుకుని ఇంతేజార్‌గంజ్ పోలీసులకు అప్పగించారు. తనిఖీల్లో ఇన్‌స్పెక్టర్ సురేశ్, ఆర్‌ఐ శివకేశవులు, వరంగల్ డ్రగ్ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్ అరవింద్‌కుమార్, ఆర్‌ఎస్సై పూర్ణ, డ్రగ్ కంట్రోల్ పోలీసులు, డ్రగ్ కంట్రోల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రేపు జాబ్ మేళా
హన్మకొండ అర్బన్: ఈనెల 10న శుక్రవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి ఎం.మల్లయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన కేఎల్ గ్రూప్ ప్రైవేట్ కంపెనీలో వేర్ హౌజ్ అసోసియేట్స్, సెక్యురిటీ, సెక్యురిటీ సూపర్‌వైజర్స్, రిసెప్షనిస్ట్ పోస్టుల భర్తీకి శుక్రవారం నగరంలోని ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ బాయ్స్ క్యాంపస్‌లోని జిల్లా ఉపాఽధి కార్యాలయంలో ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు పదో తరగతి, డిగ్రీ పూర్తి చేసి ఉండి 18 నుంచి 25 సంవత్సరాల్లోపు వా రు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న జిల్లాలో ని నిరుద్యోగ యువత వారి బయోడేటా, రెస్యూమ్‌లతో పాటు విద్యార్హత సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలతో ఉదయం 10:30 గంటల వరకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు సీహెచ్.సతీశ్‌కుమార్ 78933 94393 నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.
భూసేకరణ ఎస్‌డీసీగా
మంగీలాల్
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా ల్యాండ్ ఆక్విజేషన్ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న ఎన్.రవి బదిలీ అయ్యారు. ఆయనను భూపాలపల్లి ఆర్డీఓగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో జిల్లాకు మంగీలాల్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మంగీలాల్ భూపాలపల్లి ఆర్డీఓగా ఉన్నారు.
అంతర్జాతీయ నాట్య
పోటీలకు శ్రీహర్షిత
హన్మకొండ: అంతర్జాతీయ నాట్య పోటీలకు హనుమకొండ కృష్ణవేణి జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థిని కుసుమ శ్రీహర్షిత ఎంపికై ంది. ఈనెల 10న ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌లో ఇంటర్నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ జరగనుంది. ఈసందర్భంగా నిర్వహించనున్న నాట్య పోటీల్లో 5 దేశాలు, 25 రాష్ట్రాల నుంచి నృత్య కళాకారులు పాల్గొననున్నారు. తెలంగాణ నుంచి ఏకై క నృత్య కళాకారిణి కృష్ణవేణి జూనియర్ కళాశాల విద్యార్థిని కుసుమ శ్రీహర్షిత ఎంపికవడం విశేషం. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని ఆ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో శ్రీహర్షితను కళాశాల డైరెక్టర్ రవికిశోర్, ప్రిన్సిపాల్ రామకృష్ణ ప్రసాద్, అధ్యాపకులు పుష్పగుచ్ఛం అందించి అభినందించారు.
బ్రహ్మోత్సవాల
ఏర్పాట్లపై సమీక్ష
ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి జాతర బ్రహ్మోత్సవాలు ఈనెల 10 నుంచి స్వామివారి కల్యాణంతో ప్రారంభం కానున్నాయి. ఈసందర్భంగా బుధవారం డీపీఓ రమాకాంత్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్యంపై సంబంధిత సిబ్బంది, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా శానిటేషన్ పనులు ఎప్పటికప్పుడు చేపట్టాలని, నీరు ప్రవహించే చోట బ్లీచింగ్ పౌడర్ చల్లాలని సూచించారు. కార్యదర్శులు సమయపాలన పాటించాలన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో డీఎల్పీఓ గంగాభవాని, షరీఫొద్దీన్, ఎంపీఓ నాగరాజు, రవిబాబు, రంజిత్, 47 మంది పంచాయతీ కార్యదర్శులు, 178 మంది పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment