మధ్యవర్తులు.. మహా ముదుర్లు!
ఐనవోలు మల్లన్న సన్నిధిలో..
కాజీపేట అర్బన్: రిజిస్ట్రేషన్ శాఖలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లు భూక్రయవిక్రయదారుల నుంచి అందిన కాడికి దండుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లాలంటే డాక్యుమెంట్ రైటర్లు దడపుట్టిస్తున్నారని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్లకు భూక్రయవిక్రయదారులకు మధ్యవర్తిత్వం నిర్వహిస్తూ ‘మేం చెప్పిందే సార్ చేస్తాడు.. మమ్మల్ని కాదని రిజిస్ట్రేషన్ చేసుకోలేరు. దస్తావేజులు తయారు చేసుకున్నా కూడా సబ్ రిజిస్ట్రార్లు తిరిగి మా వద్దకే పంపిస్తారు’ అని హుకుం జారీ చేస్తున్నారు. ఇందుకు తగినట్లుగా భూక్రయవిక్రయ దస్తావేజులను ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ వెబ్‌సైట్‌లో తయారు చేసుకుని వెళ్లినా కూడా మీ డాక్యుమెంట్ రైటర్ ఎవరు? ఫలానా డాక్యుమెంట్ రైటర్ వద్దకు వెళ్లండి.. నేరుగా రాకండి అని సబ్ రిజిస్ట్రార్లు ఆదేశిస్తున్నట్లు భూక్రయవిక్రయదారులు పేర్కొంటుండడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సుమారు 600కు పైగా డాక్యుమెంట్ రైటర్లుగా చెలామణీ అవుతూ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వచ్చే భూక్రయవిక్రయదారులను గద్దల్లా పీక్కుతింటున్నారు.
కార్పొరేట్ స్థాయిలో కార్యాలయాలు
కార్పొరేట్ కార్యాలయాలను తలపించేలా.. డాక్యుమెంట్ రైటర్లు సొంతంగా కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఆనుకుని ఏర్పాటు చేసుకున్న ఈ కార్యాలయాల్లో లావాదేవీలు కొనసాగిస్తున్నారు. కాగా.. ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో డాక్యుమెంట్ రైటర్లతో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో అవినీతి పెరిగిపోతోందని ఏకంగా వీరికి ఉన్న లైసెన్స్‌లను రద్దు చేశారు. కానీ నాటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి లైసెన్స్ లేకున్నా.. డాక్యుమెంట్ రైటర్లుగా కొనసాగుతుండడం విశేషం. ప్రతీ డాక్యుమెంట్ రైటర్ తమ కార్యాలయానికి రూ.6 వేలు అద్దె చెల్లిస్తూ.. రోజూ పదివేలకు పైగానే సంపాదించడం పరిపాటిగా మారింది. డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థను రూపుమాపి సామాన్యులకు భారం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.
– వివరాలు 8లోu
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్ల దందా
కార్పొరేట్ స్థాయిలో ఆఫీసులు
భూక్రయ, విక్రయాల్లో
సామాన్యులకు వణుకు
డాక్యుమెంట్ రైటర్స్ రైట్ రైట్..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లు ఏది చెబితే అది రైట్. భూమి విలువను బట్టి దస్తావేజు తయారు చేసినందుకు, సార్‌కు చెల్లించాలి అంటూ రేట్ ఫిక్స్ చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరి వ్యాపారానికి అడ్డూ అదుపు లేకపోవడంతో సామాన్యులను పట్టి పీడిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment