సంక్రాంతి పండుగకు మహిళలు నోములు నోచడం ఆనవాయితీ. భూలోక ముద్ద, కుమ్మరివామి, సల్ల కవ్వాలు, రేపల్లెవాడ, గౌరమ్మ పల్లాలు, ముంగిట్లో ముత్యాలు.. పందిట్లో పగడాలు, పదమూడు చీరలు, ఆకాశానికి అట్లు, భూదేవికి చీరలు, పార్వతీపరమేశ్వరులు, గాంధారి తదితర నోములు నోస్తారు. వీటితో పాటు కొందరు వెండి, ఇత్తడి, రాగి, స్టీల్, ప్టాస్లిక్ పాత్రలు, వస్తువులు 13 (ఒకే రకమైనవి) నోముకుని పంచుతారు. నోములు నోచుకున్న వారు తమ చుట్టుపక్కల ముత్తయిదులను పిలిచి వాయినం ఇస్తారు. నుదుట బొట్టు పెట్టి వారి మాంగళ్యానికి పసుపు రాసి తమ చీర కొంగుచాటుగా నోము వస్తువు పెట్టుకొని వారి ఒడిలో పెట్టి వారి కాళ్లకు దండం పెడతారు. సాయంత్రం బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment