ఉన్నోళ్లకే సంక్షేమ పథకాలా? | - | Sakshi
Sakshi News home page

ఉన్నోళ్లకే సంక్షేమ పథకాలా?

Published Thu, Jan 23 2025 1:25 AM | Last Updated on Thu, Jan 23 2025 1:25 AM

ఉన్నోళ్లకే సంక్షేమ పథకాలా?

ఉన్నోళ్లకే సంక్షేమ పథకాలా?

కమలాపూర్‌: ఉన్నోళ్లకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇస్తారా? లేనోళ్లకు ఇవ్వరా అంటూ ప్రజలు గ్రామసభల్లో అధికారులను ప్రశ్నించారు. మండలంలోని పంగిడిపల్లి, అంబాల, ఉప్పల్‌, మర్రిపల్లి, లక్ష్మీపూర్‌, వెంకటేశ్వర్లపల్లి గ్రామాల్లో రైతు భరోసా, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం బుధవారం గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు అర్హుల జాబితాలను చదివి వినిపించారు. ఉన్నోళ్లు, అనర్హుల పేర్లే జాబితాల్లో ఉన్నాయని, తమ పేర్లు జాబితాలో ఎందుకు లేవని అధికారులను ప్రశ్నించారు. ఈ జాబితాలో పేర్లు లేని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని, అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తామని అధికారులు చెప్పడంతో ప్రజలు మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 6 గ్రామాల్లో నాలుగు పథకాలకు సంబంధించి 1,072 దరఖాస్తులు స్వీకరించినట్లు ఎంపీడీఓ గుండె బాబు తెలిపారు. గ్రామసభల్లో ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ దేశిని అయిలయ్యగౌడ్‌, మండల ప్రత్యేకాధికారి రాంరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ శోభారాణి, ఎంపీఓ రవి, ఏఈ ఈఆర్‌ మధు, ఆయా శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

గ్రామసభల్లో అధికారులను ప్రశ్నించిన ప్రజలు

నాలుగు పథకాలకు

1,072 దరఖాస్తుల స్వీకరణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement