ప్రతిపాదనలు సిద్ధం చేయండి
పరకాల: పరకాల సబ్‌జైలు విస్తరణ, జడ్జి బంగ్లా నిర్మాణ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పరకాల కోర్టును బుధవారం కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పెండ్యాల భద్రయ్య, న్యాయవాదులు కోర్టు సమస్యలను కలెక్టర్‌కు వివరించారు. తక్షణమే కోర్టు అభివృద్ధి పనులకు రెవెన్యూ అధికారులు ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ, తహసీల్దార్ భాస్కర్, కోర్టు సూపరింటెండెంట్ నవీనన్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
అర్హులకు సంక్షేమ పథకాలు
నడికూడ: అర్హులకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. రాయపర్తిలో బుధవారం నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్ మాట్లాడుతూ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు సంబంధించిన ముసాయిదా జాబితాలపై అభ్యంతరాలు ఉంటే గ్రామ పంచాయతీ కార్యదర్శికి లిఖితపూర్వకంగా తెలియజేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలకు దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. దరఖాస్తులను పరిశీలించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ప్రజాపాలనలో రేషన్‌కార్డుల కోసం అందించిన దరఖాస్తులను కూడా పరిశీలించనున్నట్లు చెప్పారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, అర్హులకు సంక్షేమ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. అనంతరం నడికూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్, గ్రంథాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డీఓ నారాయణ, తహసీల్దార్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రావీణ్య
Comments
Please login to add a commentAdd a comment