విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచాలి
ఐనవోలు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచాలని పాఠశాల విద్యాశాఖ ఆర్‌జేడీ కె.సత్యనారాయణ సూచించారు. మండల కేంద్రంలోని కేజీబీవీ, ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన నాణ్యత, పారిశుద్ధ్య నిర్వహణ, రికార్డులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును పరిశీలించారు. బోధన విధానం, టీఎల్‌ఎం తయారీ, వినియోగం అంశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆర్‌జేడీ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని కోరారు. కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు మహేందర్ రెడ్డి, బీమళ్ల సారయ్య, లక్ష్మి, విజయ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment