వైభవంగా మేడపల్లి ఉమాలక్ష్మీదేవి జాతర
నల్లబెల్లి: మండలంలోని మేడపల్లి ఊరచెరువు సమీపంలో గిరిజనులు ఆరాధ్యదైవగా కొలిచే ఉమాలక్ష్మీదేవత జాతర సోమవారం వైభవంగా జరిగింది. ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలతో పాటు నల్లబెల్లి, నర్సంపేట మండలంలోని రుద్రగూడెం, అర్వయ్యపల్లి, గుండ్లపహాడ్, నారక్కపేట, బజ్జుతండా, రామారావుతండా, అర్వయ్యపల్లి, భోజ్యనాయక్‌తండా, నారాయణతండా, కమలాపుర్, పర్శనాయక్‌తండా, చెక్కారాంతండా, లక్ష్మీతండాల నుంచి ఎడ్లబండ్లు, ట్రా క్టర్లు, వాహనాల్లో గిరిజనులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. జాతరకు తరలివచ్చిన గిరిజనలు ఇంటిల్లిపాది చెరువులో స్నానాలు చేసి ఉమాలక్ష్మీదేవతకు ఇష్టమైన నెయ్యి, పాలు, బెల్లం, బియ్యంతో త యారు చేసిన నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకొన్నారు. ఆలయ ప్రధాన పూజారి అజ్మీరా బామ్నమ్మ బోగిమంటలు వెలిగించి అమ్మవారికి మొక్కులు ముట్టచెప్పారు. జాతరకు ముందు మూ డు రోజుల నుంచి గిరిజనులు ఎలాంటి మద్యం, మాంసాహారం ముట్టకుండా పిండివంటకాలతోనే పవిత్రంగా ఉమాలక్ష్మీదేవత జాతరకు తరలిరా వడం విశేషం. అజ్మీర వంశీయుల పెద్దమనిషి అజ్మీ ర నారాయణ, లంబాడ గిరిజన పెద్దలు జాటోత్ ఉదయ్ సింగ్, బానోత్ హరినాథ్‌సింగ్, అజ్మీర వాగ్య, అజ్మీర సమ్ము, బాలు, శివరాం, పూల్‌సింగ్, భూక్య సారయ్య, వీరన్న, అజ్మీర మేఘనాయక్, భద్రు నాయక్, సమ్మయ్య, మంగు నాయక్‌తో పాటు లంబాడ గిరిజనులు అమ్మవారిని దర్శించుకొన్నారు. పెద్ద సంఖ్యలో గిరిజనులు తరలివస్తారని తెలిసినా.. అధికారులు కనీస సౌకర్యాలు క ల్పించకపోవడాన్ని పలువురు తప్పుపట్టారు.
పలు జిల్లాల నుంచి తరలివచ్చిన భక్తులు
Comments
Please login to add a commentAdd a comment