వినతులు త్వరగా పరిష్కరించాలి
వరంగల్: ప్రజావాణిలో స్వీకరించిన వినతులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ సత్యశారద, డీఆర్‌ఓ విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణిలు, డీఆర్‌డీఓ కౌసల్యదేవి, జెడ్పీసీఈఓ రామ్‌రెడ్డి, హౌసింగ్ పీడీ గణపతిలతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు పరిష్కరించలేని సమస్యలను దరఖాస్తుదారులకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. పెండింగ్ దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలన్నారు. గ్రీవెన్స్‌లో మొత్తం 103 వినతులు వచ్చాయి. ప్రజావాణిలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదిత రులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద
ప్రజావాణిలో 103 అర్జీలు
Comments
Please login to add a commentAdd a comment