మంగళవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
వరంగల్ రీజియన్‌లో
ఉన్న ఈవీ బస్సులు
సూపర్ లగ్జరీ
19
డీలక్స్
16
ఎక్స్‌ప్రెస్
40
హన్మకొండ: వరంగల్–2 డిపోనుంచి హైదరాబాద్ ఉప్పల్‌కు ఎలక్ట్రిక్ ఎక్స్‌ప్రెస్ బస్‌లను వన్‌మ్యాన్ సర్వీస్‌గా నడుపుతున్నారు. మధ్యలో ఒక్క జనగామలో మాత్రమే బస్సులు నిలుపుతున్నారు. దీంతో మధ్య స్టేజీలకు వెళ్లే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. వరంగల్ రీజియన్‌కు ప్రభుత్వం 112 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించింది. ఇందులో 19 సూపర్ లగ్జరీ, 18 డీలక్స్, 75 ఎక్స్‌ప్రెస్ బస్సులు రావాల్సి ఉండగా ఇప్పటివరకు 75 వచ్చాయి. ఇందులో 19 సూపర్ లగ్జరీ, 16 డీలక్స్, 40 ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉన్నాయి. జేబీఎం సంస్థ నిర్వహణలో వరంగల్–2 డిపో ద్వారా వీటిని నడుపుతున్నారు. జేబీఎం సంస్థ నేరుగా డ్రైవర్లను నియమించుకుని ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతోంది. ఆర్టీసీ బస్సుల్లో వన్‌మ్యాన్ సర్వీస్‌ను డ్రైవర్‌కు టికెట్ ఇష్యూ మిషన్ (టిమ్) ఇచ్చి నడిపిస్తున్నారు. ప్రైవేట్ సంస్థ డ్రైవర్లకు టిమ్‌లు ఇవ్వలేని పరిస్థితిలో బస్ స్టేషన్‌లలో టికెట్ జారీ చేసి పంపుతున్నారు. ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ, డీలక్స్‌తోపాటు ఎక్స్‌ప్రెస్ బస్సులను కూడా వన్‌మ్యాన్ సర్వీస్‌గా నడుపుతున్నారు.
బస్టాండ్లలోనే టికెట్లు..
మధ్య స్టేజీల్లో టికెట్ జారీ చేసే వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడంతో నేరుగా జనగామ బస్‌స్టేషన్‌లో ఆపుతూ హనుమకొండ–ఉప్పల్ మధ్య బస్సులు నడుపుతున్నారు. ఈ బస్సుల కోసం ఆయా బస్టాండ్లలోనే ప్రత్యేకంగా కండక్టర్లను కేటాయించి టికెట్లు ఇచ్చి పంపుతున్నారు. సూపర్ లగ్జరీ బస్సులను హనుమకొండ–హైదరాబాద్ మధ్య నేరుగా నడుపుతుండగా, డీలక్స్ బస్సులకు ఒక్క జనగామకే హాల్టింగ్ ఇచ్చారు. ఎక్స్‌ప్రెస్ బస్సులు హనుమకొండ, స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి, జనగామ, అలేరు, భువనగిరి, ఘట్‌కేసర్ స్టేజీల్లో ఆగుతూ ఉప్పల్ చేరుకోవాలి. తిరుగు ప్రయాణంలోనూ ఈ స్టేజీలలో హాల్టింగ్ చేస్తూ రావాలి. కానీ ఒక్క జనగామలో మాత్రమే హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. దీంతో ఎక్స్‌ప్రెస్ చార్జీతో డీలక్స్ ప్రయాణం చేస్తున్నారు. ఈ క్రమంలో స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి, జనగామ, అలేరు, భువనగిరి, ఘట్‌కేసర్‌కు వెళ్లే ప్రయాణికులు సరైనా బస్ సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు.
న్యూస్‌రీల్
హనుమకొండ నుంచి నేరుగా హైదరాబాద్ ఉప్పల్
మధ్యలో ఒక్క జనగామలోనే హాల్టింగ్
స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి, ఆలేరు, భువనగిరి వెళ్లే ప్రయాణికుల
ఇబ్బందులు
హైదరాబాద్ రూట్‌లో సర్వీసులు తగ్గింపు
మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రభుత్వం పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్న క్రమంలో అంతకు ముందు హైదరాబాద్ రూట్‌లో నడిచే సాధారణ ఎక్స్‌ప్రెస్ బస్సులు తగ్గించారు. దీంతో ఎక్స్‌ప్రెస్ బస్‌ల కొరతతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై ఆర్టీసీ అధికారులను సంప్రదించగా వరంగల్–2 డిపోలో కండక్టర్ల కొరత ఉందని తెలిపారు. త్వరలో కేటాయిస్తున్నామని, పూర్తిస్థాయిలో కండక్టర్లు రాగానే ఎలక్ట్రిక్ బస్సులను వారితోనే నడుపుతామని, అన్ని ఎక్స్‌ప్రెస్ స్టేజీలలో హాల్టింగ్ ఉంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment