![గురుకులంలో అదనపు కలెక్టర్ రాత్రి బస](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10stg303rr-330160_mr-1739216666-0.jpg.webp?itok=D5btzYpq)
గురుకులంలో అదనపు కలెక్టర్ రాత్రి బస
వేలేరు: మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలను అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి సోమవారం రాత్రి సందర్శించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘గురుకులలో నెలలో ఒకరోజు’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి రాత్రి బస చేశారు. ముందుగా ఆయన గురుకుల పాఠశాల మొత్తం కలియదిరిగారు. తరగతి గదులు, లైబ్రరీ, వంటగది, స్టోర్‌రూం, డైనింగ్ హాల్, వంట సామగ్రితో పాటు పాఠశాల పరిసరాలను, అక్కడి వసతులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడుతూ.. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా.. లేదా? అని తెలుసుకున్నారు. పాఠశాలలో ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలన్నారు. పాఠశాల డార్మెటరీలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి రాత్రి అక్కడే నిద్రించారు. కార్యక్రమంలో ఎంఈఓ చంద్రమౌళి, పాఠశాల ప్రిన్సిపాల్ అజయ్‌కుమార్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఆకస్మిక తనిఖీ
ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలం వంగరలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలను అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం వడ్డించే కూరగాయలు, ఆహార పదార్థాలను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారా లేదా? తదితర వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. మంచినీటి సౌకర్యం, విద్యార్థులకు కల్పించిన మౌలిక వసతులను పరిశీలించారు. అక్కడి నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహిస్తున్న రేషన్‌కార్డు డేటా ఎంట్రీని పరిశీలించారు. కార్యక్రమంలో ఆయన వెంట తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్ తదితర సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment