![మోడల్ ఇంటిని నాణ్యతతో నిర్మించాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10stg251-330153_mr-1739216666-0.jpg.webp?itok=gcmNRF-J)
మోడల్ ఇంటిని నాణ్యతతో నిర్మించాలి
కలెక్టర్ ప్రావీణ్య
ధర్మసాగర్: ఇందిరమ్మ మోడల్ ఇంటిని నిబంధనల మేరకు నాణ్యతతో నిర్మించాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ప్రతీ మండలంలో మోడల్ ఇందిరమ్మ ఇంటిని నిర్మించాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో ధర్మసాగర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ ఇంటిని పరిశీలించారు. నాణ్యత, తదితర వివరాలను హౌసింగ్ అధికారి రాజేంద్రర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రావీణ్య మాట్లాడుతూ.. ఇందిరమ్మ మోడల్ ఇంటి నిర్మాణానికి ఉపయోగపడే సిమెంట్, ఇటుకల తయారీని మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని అధికారులకు సూచించారు. అనంతరం మండలంలోని బీసీ, సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, దేవాదుల క్వార్టర్స్ నిరుపయోగంగా ఉండడంతో వాటిని అధికారులతో కలిసి పరిశీలించారు. హాస్టళ్లను తిరిగి ధర్మసాగర్‌లో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
కేజీబీవీ తనిఖీ..
ధర్మసాగర్ మండలం ముప్పారం కేజీబీవీ పాఠశాలను కలెక్టర్ ప్రావీణ్య సందర్శించి తరగతి గదులు, వంటగది, స్టోర్ రూం, మెడికల్ రూమ్‌ను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం కేజీబీవీలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో రూ.7.50 లక్షలతో చేపట్టిన పనులు పరిశీలించారు. ఎంపీ ల్యాండ్స్ నిధులతో విద్యుత్, హైమాస్ట్ లైట్లు, పంచాయతీ రాజ్ శాఖ నుంచి రూ.25 లక్షలతో అప్రోచ్ రోడ్డు మంజురు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామ్‌రెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి బాలరాజు, డీఈఓ వాసంతి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ పవిత్ర, తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ అనిల్‌కుమార్, ఎంఈఓ రాంధన్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ మాధవి, కో–ఆర్డినేటర్ సునీత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment