ఆరోగ్యమస్తు | Sakshi
Sakshi News home page

ఆరోగ్యమస్తు

Published Wed, May 8 2024 4:35 AM

ఆరోగ్

వైద్యో నారాయణో హరి.. అంటే వైద్యులు దేవతలతో సమానం అని అర్థం. ఆ రోగులకు వైద్యం చేయించుకునేందుకు ఆర్థికంగా చేయూత అందించేవారిని సైతం వారు దేవుడిగానే కొలుస్తారు. ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలంలోని పూళ్ల గ్రామంలో ఓ మానసిక వైకల్యం గల బాలుడికి, అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు వైద్యసేవలు అందజేయడంతోపాటు సహాయ నిధి సొమ్ము అందజేసి వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సహకరించారు. పేదల ఆరోగ్య, ఆర్థిక పరిస్థితికి సహకారం అందిస్తూ జగన్‌ మానవత్వాన్ని చాటుకుంటున్నారని, మా కుటుంబాల్లో వెలుగులు నింపిన ఆయనకు జీవితాంతం తాము రుణపడి ఉంటామని ఆయా కుటుంబాల సభ్యులు సంతోషంగా చెబుతున్నారు. – భీమడోలు

పిల్లాడిని చూసి చలించిపోయారు

పూళ్ల పంచాయతీ తూర్పు హరిజనపేటకు చెందిన అందుగుల లాజర్‌, జయశ్రీ కుటుంబం పడిన వేదన వారి మాటల్లోనే.. మాకు నవదీప్‌, భార్గవి ఇద్దరు సంతానం. వీరిలో నవదీప్‌ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. దీనికితోడు రెండేళ్ల క్రితం నుంచి ఫిట్స్‌ వచ్చి ఎక్కడపడితే అక్కడ పడిపోయేవాడు. బయటకు వెళ్లినా ఇంటికి తిరిగి వచ్చేవాడు కాదు. ఎవరినీ గుర్తు పట్టేవాడు కాదు. దీనితో కుటుంబమంతా విలవిల్లాడిపోయింది. ఊరంతా తిరిగి పిల్లవాడిని వెతికి ఇంటికి తీసుకురావాల్సిన పరిస్థితి. ఏరోజు ఏం జరుగుతుందోనన్న భయం వెంటాడేది. పిల్లాడి ఆరోగ్యం కోసం 24 ఆసుపత్రులు తిరిగిం.. సుమారు రూ.8 లక్షలు అప్పులు చేసి వైద్యం చేయించినా పరిస్థితి ఆగమ్యగోచరం. ఇంక అప్పు కూడా దొరకని పరిస్థితి. గత ఏడాది సెప్టెంబర్‌ 16వ తేదీన కాపునేస్తం కార్యక్రమానికి నిడదవోలు వచ్చిన జగనన్నను ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు సహకారంతో కలిసి మా గోడును విన్నవించుకున్నాం. ఆయన మా పిల్లాడిని చూసి చలించిపోయారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి ఆరోజు సాయంత్రమే హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో చేర్పించేలా చర్యలు తీసుకున్నారు. మా నవదీప్‌ ఐదు రోజుల్లో సాధారణ స్థితిలో చేరుకుని కోలుకున్నాడు. సుమారు రూ.3.50 లక్షల ఖర్చును ప్రభుత్వం భరించింది. ఇప్పుడు మా అబ్బాయి అందరి పిల్లల్లాగే ఆడుకుంటూ చదువుకుంటున్నాడు. మా దిగులంతా తీరింది. జనవరి 29వ తేదీన భీమవరం వచ్చిన జగనన్నను కలిసి నవదీప్‌ని చూపించి ఆయనకు కృతజ్ఞతలు తెలిపాం. ఆస్పత్రి నుంచి డిశ్చార్చి చేసిన తరువాత మందులు వాడుతున్నామని.. ప్రతి నెలా రూ.5 వేలు వరకు ఖర్చవుతున్నాయని.. మందులకు భారంగా ఉందని చెప్పగానే వెంటనే జగనన్న రూ.లక్ష సీఎం సహాయ నిధి చెక్కును అందించారు. మా కుటుంబానికి దైవం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. జగన్‌ పాలనలో మాకుటుంబానికి వివిధ పథకాల ద్వారా మొత్తం రూ.11.60 లక్షల వరకు మేలు జరిగింది.

ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీ మాకు దక్కలేదు

మా కుమార్తె భార్గవికి కడపులో కణితి వచ్చింది. చంద్రబాబు పాలనలో ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద మాకు సహాయం చేయలేదు. మాలాంటి పేదలకు ఆ పథకం ఉపయోగపడలేదు. రూ.1.09 లక్షల సొంత డబ్బులతో అమ్మాయికి వైద్యం చేయించుకున్నాం. చంద్రబాబును నమ్మవద్దు.

ఆరోగ్యవంతమైన సమాజం కోసం..

ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ వ్యయపరిమితిని రూ.25 లక్షలకు పెంచడంతోపాటు 3 వేలకు పైగా వ్యాధులకు చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నారు. అలాగే ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్‌ వంటి కార్యక్రమాల ద్వారా ఇంటింటికీ వైద్యసేవలు అందిస్తున్నారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా మరెందరినో ఆదుకుంటున్నారు. వైద్య రంగానికి ఇతోధికంగా నిధులు ఖర్చుచేస్తూ ప్రజల ఆరోగ్యానికి జగనన్న భరోసా కల్పిస్తున్నారు.

– పుప్పాల శ్రీనివాసరావు, ఎమ్మెల్యే, ఉంగుటూరు

నరాల బలహీనత తగ్గింది

నా పేరు నూతులపాటి మార్తమ్మ. నాకు భర్త ఏసు, ఇద్దరు సంతానం ఉన్నారు. పిల్లలు పుట్టిన తరువాత నరాల బలహీనత వ్యాధికి గురయ్యాను. దీనితో ఎక్కువ సేపు నిలబడలేకపోవడం, వ్యక్తిగత పనులు సైతం చేసుకోలేక బాధపడేదాన్ని. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం మాది. వైద్యం చేయించుకునే స్తోమత లేదు. మా తమ్ముడు అందుగుల లాజర్‌ సహాకారంతో జనవరి 29న భీమవరంలో సీఎం జగన్‌ను కలిశా. ఆయనకు నా బాధ చెప్పగా తక్షణమే వైద్య సహాయం చేయించాలని అధికారులను ఆదేశించారు. భీమవరంలోని వర్మ ఆసుపత్రిలో లక్షలాది రూపాయల వైద్యం ఉచితంగా చేయించారు. దీనితో నేను పూర్తిగా కోలుకున్నాను. మందుల ఖర్చులు కూడా భారం కాకూడదని రూ.లక్ష సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును అందించారు. ఆయన మేలును మరువలేను.

ఆరోగ్యమస్తు
1/4

ఆరోగ్యమస్తు

ఆరోగ్యమస్తు
2/4

ఆరోగ్యమస్తు

ఆరోగ్యమస్తు
3/4

ఆరోగ్యమస్తు

ఆరోగ్యమస్తు
4/4

ఆరోగ్యమస్తు

Advertisement
Advertisement