ర్యాంపుల్లో లోకల్ రాజ్యం
●
వెయిటింగ్ చేసి ఖాళీగా..
తీపర్రులో లోడింగ్ ఇంకా మొదలు పెట్టకపోవడంతో గో పాలపురం ర్యాంపు వద్దకు వ చ్చాం. ఇక్కడ లోకల్ ట్రాక్టర్లకే లోడింగ్ చేస్తుండటంతో నిన్నంతా వెయిటింగ్ చేసి ఖాళీగా వెళ్లిపోయాం. ఈరోజు మళ్లీ వచ్చాం.
– కె.సత్యనారాయణ, తణుకు, ట్రాక్టర్ డ్రైవర్
లోకల్ బళ్లకే లోడింగ్
ర్యాంపుల వద్ద లోకల్ ఫీలింగ్ చూపిస్తున్నారు. వారి వాహనాల్లోనే ఇసుక లోడింగ్ చేసుకుంటున్నారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాహన డ్రైవర్లు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఒక్కోసారి రోజుకు ఒక ట్రిప్పు కూడా పడకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం.
– రావూరి రాజా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లారీ అసోసియేషన్ అధ్యక్షుడు, పాలకొల్లు
సాక్షి, భీమవరం: వశిష్ట గోదావరిలో వరద నీరు లాగినా జిల్లావాసులను ఇసుక కష్టాలు వీడటం లేదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) అనుమతులు రాక స్థానిక ర్యాంపులు తెరుచుకోవడం లేదు. పక్క జిల్లాల ర్యాంపుల్లో లోకల్ హవా నడుస్తుండటంతో జిల్లాకు చెందిన ట్రాక్టర్లు, లారీలకు రోజుకు ఒక ట్రిప్పు కూడా లోడవ్వడం గగనమవుతోంది. దీంతో వెయిటింగ్, రవాణా చార్జీల రూపంలో జిల్లావాసులు అదనంగా నష్టపోవాల్సి వస్తోంది.
సీఆర్‌జెడ్ పరిధిలోకి..
జిల్లాలో సిద్దాంతం 1, 2, కరుగోరుమిల్లి, కోడేరు, నడిపూడి 1, 2 ర్యాంపులు, దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం, యలమంచిలిలంక, చించినాడ, మాధవాయిపాలెంలోని డీసిల్టేషన్ పాయింట్లు ద్వారా ఇసుక తవ్వకాలు జరిగేవి. సముద్రపు ఉప్పునీటి పోటు వలన ఈ రీచ్‌లు కోస్టల్ రెగ్యులేటరీ జోన్ (సీఆర్ జెడ్) పరిధిలోకి వెళ్లడంతో నిర్మాణ పనులకు ఇక్కడి ఇసుక పనికి రాదని ర్యాంపులు తెరిచేందుకు ఎన్‌జీటీ అనుమతులు నిలిపివేసింది.
తీరని ఇసుక వెతలు
జిల్లా అవసరాల నిమిత్తం తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం తీపర్రు, కొవ్వూరు మండలం ఔరంగబాద్ ర్యాంపులను ప్రభుత్వం కేటాయించినట్టు అధికారులు తెలిపారు. తీపర్రు జిల్లాకు చేరువగానే ఉన్నా ఔరంగబాద్ ర్యాంపు దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో రవాణా చార్జీల రూపంలో వినియోగదారులపై అదనపు భారం పడుతుందని లారీ యజమానులు అంటున్నారు. జిల్లాకు సమీపంగా ఉన్న నిడదవోలు మండలంలో ర్యాంపు కేటాయించినా కొంత భారం తగ్గేదని వారంటున్నారు. తీపర్రు ర్యాంపు వద్ద ఉచిత ఇసుక స్టాకు పెట్టే పని శుక్రవారం ప్రారంభమైందని ట్రాక్టర్లలో లోడింగ్‌కు మరో రెండు మూడు రోజుల సమయం పడుతుందని అక్కడి అధికారులు చెబుతున్నారు.
లోకల్ వాహనాలంటూ..
తూర్పుగోదావరి జిల్లాలోని తీపర్రు ర్యాంపు ఇంకా ప్రారంభం కాకపోవడంతో కొద్దిరోజులుగా పెండ్యాల, గోపాలపురం, జొన్నాడ తదితర ర్యాంపులకు ట్రాక్టర్లు క్యూ కడుతున్నాయి. కాగా ఇసుక లోడింగ్‌లో ర్యాంపుల వద్ద అక్కడి లోకల్ కూటమి నాయకుల పెత్తనమే నడుస్తోందని జిల్లాకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్లు అంటున్నారు.
క్యూ పద్ధతిని పాటించాలని ఎవరైనా వారి ట్రాక్టర్లను అడ్డుకుంటే లోకల్ బళ్లంటూ తమపై గుంపులుగా గొడవలకు దిగుతున్నారని వాపోతు న్నారు. అక్కడి వారు రోజుకు పది వరకు ట్రిప్పులు వేస్తే తమకు ఒక ట్రిప్పు పడటం గగనమవుతోందని ఆవేదన చెందుతున్నారు. లారీలదీ ఇదే పరిస్థితి. గోపాలపురం ర్యాంపులో ట్రాక్టర్‌లో ఒక యూ నిట్ ఇసుక లోడింగ్ నిమిత్తం రూ.500లు వసూలుచేస్తుండగా రవాణా, వెయిటింగ్ ఖర్చులతో కలిపి పాలకొల్లుకు రూ.4,000 వరకు, తణుకు ప్రాంతానికి రూ.3,000 వరకు ధరకు ఇసుకను చేరవేస్తున్నట్టు ట్రాక్టర్ డ్రైవర్ ఒకరు తెలిపారు.
కూటమి నేతల ఇష్టారాజ్యం
జిల్లాకు సమీపంలోని తూర్పుగోదావరి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోని పలు ర్యాంపులు తెరుచుకున్నాయి. జిల్లాలో రెండు యూనిట్ల నుంచి ఆరు యూనిట్ల సామర్థ్యం కలిగిన లారీలు 2,000 వరకు ఉండగా, ఒక యూనిట్ సామర్థ్యం కలిగిన ట్రాక్టర్లు 500 వరకు ఉన్నాయి. వీరంతా ఇసుక కోసం పక్క జిల్లాల్లోని ర్యాంపులకు వెళు తున్నారు. కాగా లోకల్ పేరిట కూటమి నాయకులు కాసుల వేట సాగిస్తున్నారు. ర్యాంపుల వద్ద లోకల్ బళ్లకే మొదటి ప్రాధాన్యత అంటూ క్యూ లో ఉన్న నాన్‌లోకల్ లారీలు, ట్రాక్టర్లను తప్పించుకుని ముందుకు పోనిచ్చి తమ వాహనాల్లో ఇ సుకను లోడింగ్ చేయించుకుంటున్నారు. పోలీసులు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా మారింది.
పశ్చిమలో ఇసుక కష్టాలు
ఎన్‌జీటీ అనుమతులు రాక జిల్లాలో తెరుచుకోని ర్యాంపులు
తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో ర్యాంపులే దిక్కు
అక్కడి రీచ్‌లలో స్థానిక కూటమి నాయకుల పెత్తనం
ఉచితం మాటున కాసుల వేట
లోకల్ ట్రాక్టర్లు, లారీలకే లోడింగ్
పగలంతా నిల్వలు.. రాత్రిళ్లు అమ్మకాలు
‘పశ్చిమ’ వాహనాలకు ఒక్క ట్రిప్పు కూడా గగనం
వెయిటింగ్, రవాణా చార్జీలతో అదనపు భారం
ఉచితం మాటున వ్యాపారం
ఉచిత ఇసుకను ట్రాక్టర్లలో తెచ్చి ఎక్కడికక్కడ స్టాకులు పెట్టి రాత్రి వేళల్లో లారీల ద్వారా అధిక ధరలకు విక్రయిస్తున్నరు. ఐదు యూనిట్ల లారీ పెనుగొండకు దాదాపు రూ.16 వేలు, పాలకొల్లుకు రూ.20 వేలు, నరసాపురానికి రూ.24 వేలు, భీమవరానికి రూ.28 వేలు, ఆకివీడుకు రూ.30 వేల వరకు అమ్మకాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment