తణుకు: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలుచోట్ల ఆదివారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. తణుకు మండలం కోనాల గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న గెడ్డం వెంకటేష్‌ను అరెస్ట్ చేసి, 7 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సత్తి మణికంఠరెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సైలు బి.లక్ష్మి, ఆర్.మధుబాబు, సిబ్బంది పాల్గొన్నట్లు చెప్పారు.
పాలకొల్లు అర్బన్: అక్రమంగా మద్యం విక్రయిస్తున్న పోడూరు మండలం వేడంగి గ్రామానికి చెందిన కొప్పిశెట్టి పెద్దిరాజును అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 4 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ మద్దాల శ్రీనివాసరావు తెలిపారు.
కై కలూరు: ముదినేపల్లి మండలం ప్రొద్దువాక గ్రామంలో బెల్టు దుకాణాలపై ఆదివారం ఎకై ్సజ్ దాడులు నిర్వహించినట్లు ఎకై ్సజ్ సీఐ ఎస్‌కే.రమేష్ చెప్పారు. బెల్టు దుకాణం నిర్వహిస్తున్న కల్లి రామకృష్ణ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి, 10 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. తనిఖీల్లో ప్రొహిబిషన్ ఎస్సై ఆదినారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.
భీమడోలు: భీమడోలు గొలుసుల గేటు ఏరియాలో బెల్ట్‌షాపు నడుపుతున్న వనం వెంకట రత్నం అనే వ్యక్తిని ఆదివారం రాత్రి అరెస్ట్ చేసినట్లు ఎస్సై వై.సుధాకర్ తెలిపారు. ఆతని వద్ద నుంచి 12 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment