ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల పని వేళలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పైలెట్ ప్రాజెక్టుగా నెల్లూరు జిల్లాలో అమలు పరచడాన్ని ఉపసంహరించుకోవాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అకడమిక్ కమిటీ కన్వీనర్ గుగ్గులోతు కృష్ణ, ఏలూరు జిల్లా అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు ఈ. రత్నం బాబు, జీ మోహన్ రావు విద్యాశాఖను కోరారు. గతంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనివేళలు సవరించారన్నారు. 5 కిలోమీటర్ల పరిధి నుంచి విద్యార్థులు బడులకు వస్తున్నందున సాయంత్రం 5 వరకు పాఠశాలల నిర్వహణ వల్ల విద్యార్థులకు రక్షణ కరువవుతుందని, డ్రాపవుట్ల శాతం పెరుగుతుందని, ఈ మేరకు తదుపరి చర్యలు చేపట్టాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment