శిల్పి గురించి శిల్పంమాట్లాడుతుంది | - | Sakshi
Sakshi News home page

శిల్పి గురించి శిల్పంమాట్లాడుతుంది

Published Mon, Nov 18 2024 1:13 AM | Last Updated on Mon, Nov 18 2024 1:13 AM

శిల్ప

శిల్పి గురించి శిల్పంమాట్లాడుతుంది

లూరు జిల్లా, చింతలపూడికి చెందిన కనకలింగ వీరబ్రహ్మం ఒకే చట్రంలో రామాయణాన్ని ఆవిష్కరించారు. అరవై నాలుగేళ్ల వీరబ్రహ్మం ఆవిష్కరణల్లో ఇలాంటివెన్నో. ఉలి పట్టుకోవడానికి ముందు ఆయన మృదంగనాదం చేశారు. ఎలక్ట్రికల్‌ వర్క్‌ చేశారు. చివరికి ఉలితోనే స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. తన ఉలి ప్రస్థానం గురించి ఆయన ‘సాక్షి’తో చెప్పిన వివరాలివి.

ఫొటోలో మృదంగమే ఉంది

వీరబ్రహ్మం తండ్రి స్వర్ణకారుడు, మృదంగ కళాకారుడు కూడా. వీరబ్రహ్మం మృదంగం మీద ఆసక్తి పెంచుకున్నారు. ఆరేళ్ల వయసులో కచేరీల్లో పాల్గొన్నారు కూడా. ఇవి అభిరుచిని సంతృప్తి పరుచుకోవడం కోసం మాత్రమేనని, పెరుగుతున్న బంగారం ధరలు చూస్తే స్వర్ణకారులకు పని దొరకడమూ కష్టమేనని, ఉపా ధి కోసం మరేదైనా పని నేర్చుకో మని చెప్పారు. అది పెద్ద శరాఘాతం. మృదంగం ముట్టుకుంటే కొ డతానని భయపెట్టినప్పుడు కన్నీళ్ల పర్యంతం అయి మృదంగంతో ఒ క్క ఫొటో తీసుకుంటానని బతిమాలడం, చివరికి ఫొటో తీసుకుంటే ఆ ఫొటోలో మృదంగం కనిపిస్తోంది. కానీ బ్రహ్మం కనిపించలేదు. బ్రహ్మం సన్నగా, చిన్నగా ఉండడంతో ఆ ఫొటో కోరిక కూడా అసంతృప్తిగానే మిగిలిపోయింది. ఆయన జీవితంలో సంగీతం ఒక ముగిసిపోయిన ఘట్టమైంది.

కార్పొరేషన్‌ రద్దయింది

ఎలక్ట్రికల్‌ వర్క్‌ నేర్చుకుని ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో మోటారు మెకానిక్‌గా జీవితాన్ని ప్రారంభించారు. నాలుగేళ్లకే ఆ కార్పొరేషన్‌ రద్దు కావడంతో మెకానిక్‌గా ప్రైవేట్‌ వర్క్స్‌ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించారు. పోషణకు ఇబ్బంది లేదు కానీ, కళాత్మకమైన పని ఫలానా చేశాననే ఆత్మ సంతృప్తి లేకపోతే జీవితం పరిపూర్ణం కాదనుకునేవారు. ఖాళీ సమయాల్లో చెక్కను శిల్పంగా మలిచే ప్రయత్నం చేసేవారు. ఆ ప్రయత్నం అద్భుతంగా ఉండటంతో అతడి ప్రస్థానం కళాపథంలో నడిచింది.

లేపాక్షి తక్కువ చేసింది

రాధాకృష్ణుల విగ్రహాన్ని చెక్కడానికి నెల పట్టింది. లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్‌ వాళ్లు రెండున్నర వెయ్యికి తీసుకుంటామనడంతో హతాశులయ్యారు వీరబ్రహ్మం. కళాకారులు బతికేదెలా అన్నప్పుడు... తమ దగ్గర ఉన్న బొమ్మలన్నీ అదే ధరలో సేకరించినట్లు, లేపాక్షి బ్రాండ్‌ ఉంటే ఫినిషింగ్‌ చూడరని, ఫినిషింగ్‌ కోసం ఎక్కువ రోజులు కష్టపడకుండా స్థూలంగా రూపం వస్తే చాలని చెప్పారు నిర్వాహకులు. ఈ ధోరణి శి ల్పాలకు శిల్పకారులకు శిక్ష విధించడమేనని బాధపడ్డారాయన. తన శిల్పాల కోసం మార్కెటింగ్‌ ప్రయత్నాలు మానేసి తనకు నచ్చినవి చెక్కుతూ సంతోషిస్తున్నారు. కానీ ఆయన శిల్పాలు మాట్లాడుతున్నా యి, ఆయన పనిని మార్కెట్‌ చేస్తున్నాయి. బ్రహ్మంలో శిల్పకారుడిని నిత్యం పనిలో ఉంచుతున్నాయి. నోటిమాట ద్వారా తెలుసుకున్న కళాభిమానులు బొమ్మల కోసం ఆర్డర్‌లు ఇస్తున్నారు. వీటితోపాటు తన సంతృప్తి కోసం మూడు నెలలు శ్రమించి రామాయణం మొత్తాన్ని ఒకే చట్రంలో చెక్కారు. జాతీయ చిహ్నం, భరతమాత, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ నుంచి పింగళి వెంకయ్య వరకు మన జాతీయనాయకుల శిల్పాల కోసం ఉలి పట్టడం ఆయన ఆకాంక్ష. శిల్పగురు గౌరవాన్ని అందుకోవడం శిల్పకారుడిగా తన లక్ష్యమని చెప్పారాయన.

– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

దారుశిల్పి మందగుల కనకలింగ వీరబ్రహ్మం

ఎవరి దగ్గరా శిష్యరికం చేయలేదు

కళ తన జీన్స్‌లోనే

ఉందన్నారాయన..

కళ అన్నం పెట్టే రోజులు కావన్నాడు తండ్రి

బ్రహ్మం నుదుట ఆ బ్రహ్మ ‘కళాకారుడ’నే రాశాడు

వినాయకుడితో కొత్త జీవితం

నేను చెక్కిన తొలి శిల్పం వినాయకుడు. సరదా కొద్దీ చిన్న చిన్న బొమ్మలేవో చేస్తుండేవాడిని. అది 2001, మా మిత్రుడు కొన్న వినాయకుడి విగ్రహాన్ని చూ స్తే బాధనిపించింది. ఆ శిల్పి మనసు పెడితే బాగా చెక్కి ఉండవచ్చనిపించింది. కళ అంతరించిపోవడానికి దగ్గరగా ఉందా అనే ఆవేదన కూడా కలిగింది. అలాంటి వినాయకుడి రూపాన్నే ఇంకా అందంగా తీసుకురావాలని చెక్కాను. అప్పటి నుంచి దారుశిల్పిగా మారాను. మా అమ్మ మట్టిబొమ్మలు చేసేది. తాతయ్య వెండి, రాగి వస్తువులకు నగిషీ పనిచేసేవారు, అన్నయ్య డ్రాయింగ్‌ వేసేవారు. ఇన్ని కళల మధ్య పెరగడం వల్లనేమో నా తోపాటు నాలో శిల్పకారుడు కూడా పెరిగాడు. – మందగుల కనకలింగ వీరబ్రహ్మం, దారుశిల్పి

No comments yet. Be the first to comment!
Add a comment
శిల్పి గురించి శిల్పంమాట్లాడుతుంది1
1/5

శిల్పి గురించి శిల్పంమాట్లాడుతుంది

శిల్పి గురించి శిల్పంమాట్లాడుతుంది2
2/5

శిల్పి గురించి శిల్పంమాట్లాడుతుంది

శిల్పి గురించి శిల్పంమాట్లాడుతుంది3
3/5

శిల్పి గురించి శిల్పంమాట్లాడుతుంది

శిల్పి గురించి శిల్పంమాట్లాడుతుంది4
4/5

శిల్పి గురించి శిల్పంమాట్లాడుతుంది

శిల్పి గురించి శిల్పంమాట్లాడుతుంది5
5/5

శిల్పి గురించి శిల్పంమాట్లాడుతుంది

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement