నవరత్నాల లోగో ధ్వంసం
టీడీపీ నాయకుల దుశ్చర్య
ముసునూరు: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలంలో టీడీపీ వర్గీయుల దాడులను వైఎస్సార్ సీపీ మండల నేతలు తీవ్రంగా ఖండించారు. టీడీపీ నేతలు దాడి చేసి పగులగొట్టిన నవరత్నాల లోగో, ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆదివారం వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు ఎం.నాగవల్లేశ్వరరావు తదితరులు పరిశీలించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల అనంతరం మండలంలోని రమణక్కపేట, కాట్రేనిపాడు గ్రామాల్లో టీడీపీ వర్గీయులు, వైఎస్సార్ సీపీ అనుయాయులపై భౌతిక దాడులు చేసి ఇద్దరిని గాయపర్చారని, తాజాగా ఓ పచ్చ పత్రికలో వచ్చిన కథనాన్ని ఆసరాగా తీసుకుని గోపవరంలోని సచివాలయం–1పై ఏర్పాటు చేసిన నవరత్నాల లోగోను, ప్రారంభోత్సవ శిలాఫలకంపై ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రాన్ని పగుల కొట్టారన్నారు. నేతలు ముసునూరుకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సర్పంచ్ కంచర్ల వాణి, పార్టీ అధ్యక్షుడు వల్లభనేని గోపాల కృష్ణ, స్థానిక సొసైటీ అధ్యక్షుడు కోటగిరి గోపాలకృష్ణ, వైస్ ఎంపీపీ పి.గంగాధర్, జెడ్పీటీసీ డా.వరికూటి ప్రతాప్, వార్డు సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment