భీమవరం: వాకింగ్‌కు వెళ్తున్న తన నుంచి సెల్‌ఫోన్ దొంగిలించి పారిపోతున్న వ్యక్తిని పట్టుకోడానికి ప్రయత్నించగా బ్లేడ్‌తో దాడి చేసినట్లు పట్టణంలోని నాచువారి సెంటర్‌కు చెందిన నరహరశెట్టి రాజ్‌కుమార్ ఫిర్యాదు చేశారు. రాజ్‌కుమార్ సోమవారం వీరమ్మ పార్క్ వద్దకు వాకింగ్‌కు వెళుతుండగా తణుకు పట్టణానికి చెందిన వరదా దినకరన్ రాజ్‌కుమార్ జేబులోని సెల్‌ఫోన్ దొంగిలించాడు. పట్టుకోడానికి ప్రయత్నించగా బ్లేడ్‌తో దాడిచేశాడు. అటుగా వస్తున్న మరో ఇద్దరు దినకరన్‌ను పట్టుకున్నారు. దినకరన్‌ను పోలీసుస్టేషన్లో అప్పగించి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment